News November 14, 2025

మాజీ AVSO సతీశ్‌ మరణంపై YCP ట్వీట్

image

మాజీ <<18284097>>AVSO సతీశ్‌<<>>ది ఆత్మహత్యే అని ఆయన సన్నిహితులు చెప్పారంటూ YCP ట్వీట్ చేసింది. ‘సతీశ్ మరణానికి ముందు గోడును సన్నిహితుల వద్ద వెళ్లబోసుకున్నాడట. పరకామణి కేసులో సిట్‌ బృందం అప్పటి CIలు జగన్మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్‌, సతీశ్ కుమార్, SI లక్ష్మిరెడ్డిని వేధించి విచారణలో తాము చెప్పిన పేర్లు చెప్పాలంటూ ఒత్తిడి చేశారట. వీటిని తట్టుకోలేకే సతీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని సన్నిహితులు అన్నారు’ అంటూ రాసుకొచ్చింది.

Similar News

News November 14, 2025

NRPT: నేటి బాలలే రేపటి పౌరులు: కలెక్టర్

image

నేటి బాలలే రేపటి పౌరులని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం నారాయణపేట పట్టణంలోని పళ్ళ వీధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలలో ముందుండాలని చెప్పారు. జవహర్ లాల్ నెహ్రూకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టమని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

News November 14, 2025

కల్వకుర్తి: బీసీ బాలుర వసతి గృహం సంఘటనపై విచారణ

image

కల్వకుర్తి పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర వసతి గృహంలో దాదాపు 30 మంది విద్యార్థులను అకారణంగా అతిథి ఉపాధ్యాయుడు చితకబాదిన సంఘటనపై స్థానిక ఎంఆర్ఓ ఇబ్రహీం శుక్రవారం సాయంత్రం విచారణ చేపట్టారు. హాస్టల్ వద్దకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. విచారణకు సంబంధించిన రిపోర్టు ఉన్నతాధికారులకు అందజేస్తానని ఆయన పేర్కొన్నారు.

News November 14, 2025

మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం: ఎస్పీ జానకి

image

నిర్మల్ జిల్లాలో మహిళల భద్రతకు ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మహిళా రక్షణ కోసం షీ టీం బృందం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. మహిళలపై వేధింపులు, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఆకతాయిలను ఎక్కడైనా గమనించినా వెంటనే డయల్ 100కు లేదా షీ టీం పోలీసులకు 8712659550 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.