News November 14, 2025
జూబ్లీహిల్స్‌లో BJP డిపాజిట్ గల్లంతు.. కారణమిదే?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో BJPకి 8.76% ఓటింగ్ నమోదైంది. డిపాజిట్ గల్లంతు అవ్వడం మీద రాజకీయ నిపుణుల విశ్లేషణలు ఈ విధంగా ఉన్నాయి.
1.సెగ్మెంట్‌లో మైనార్టీల ఆధిపత్యం
2. 7 డివిజన్లకు ఒక్క BJP కార్పొరేటర్ లేకపోవడం
3.INC vs BRS మధ్యనే పోటీ అన్న సంకేతాలు
4.కనిపించని స్టార్ క్యాంపెయినర్లు
5.ప్రజలను ప్రభావితం చేయని ప్రచారం
5.ముందు నుంచే BJPని పక్కనబెట్టిన సర్వేలు
6.పోల్ మేనేజ్‌మెంట్‌లో విఫలం
Similar News
News November 14, 2025
ఏలూరు: ఐసీడీఎస్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

జిల్లా ICDS అధికారులపై ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం
ఆమె తన కార్యాలయంలో మాట్లాడారు. ఇటీవల ఆహార కమిషన్ సభ్యులు అంగన్వాడీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారన్నారు. ఈ తనిఖీల్లో పిల్లలు, మహిళలకు అందించే ఆహరం నాణ్యత లేదని వారు గుర్తించినట్లు తెలిసిందన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్లు, CDPOలు అంగన్వాడీ కేంద్రాల తనిఖీలను చేసిన వివరాలను అదించాలని PDని ఆదేశించారు.
News November 14, 2025
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

గంభీరావుపేట మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ధాన్యం నిల్వలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం రైస్ మిల్లులకు తరలించారో అధికారులతో ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, MRO మారుతి రెడ్డి, MPDO రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
News November 14, 2025
KMR: టీఆర్పీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా తాహెర్ బిన్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బొక్కల సంతోషిని నియమించారు. వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన పార్టీ అధ్యక్షుడు మల్లన్నకు కృతజ్ఞతలు తెలిపారు.


