News November 14, 2025
ఇబ్రహీంపట్నం: ’48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలి’

కొనుగోలు చేసిన వరి ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం అయన పరిశీలించారు. టార్పాలిన్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రైస్ మిల్లుల వద్ద జాప్యం లేకుండా దిగుమతయ్యేలా చూడాలన్నారు. RDO తదితరులున్నారు.
Similar News
News November 14, 2025
ASF: రోడ్డు సౌకర్యం కల్పించండి.. సీఎం ప్రజావాణిలో వినతి

ASF జిల్లాలోని మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కల్పించాలని TAGS జిల్లా అధ్యక్షురాలు మాలశ్రీ కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని సీఎం ప్రజావాణిలో ప్రజా భవన్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి, మంగి, జోడేఘాట్ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.
News November 14, 2025
గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

రెజోనెన్స్ నిర్వహించిన రెజోఫెస్ట్ 2025 గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. 35 క్యాంపస్‌లకు చెందిన 7,000+ విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. డా. జైతీర్థ్ ఆర్. జోషి, నాగ్ అశ్విన్, శర్వానంద్, సుమా కనకాల వంటి ప్రముఖులు హాజరై విద్యార్థులకు స్ఫూర్తి, సృజనాత్మకత, లక్ష్య సాధన గురుంచి వివరించారు.