News November 14, 2025
జనగామ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలపై కలెక్టర్ రివ్యూ మీటింగ్

నిరుపేదలకు కనీస నివాస గృహం ఉండాలన్న సంకల్పంతో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో వంద శాతం త్వరగా పూర్తి కావాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పెండింగ్ ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మీద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, ఆర్డీవోలు, హోసింగ్ పీడీ, ఎంపీడీవోలు, ఇంజినీరింగ్ అధికారులతో గూగుల్ మీటింగ్ ద్వారా శుక్రవారం కలెక్టర్ రివ్యూ చేశారు.
Similar News
News November 14, 2025
ASF: రోడ్డు సౌకర్యం కల్పించండి.. సీఎం ప్రజావాణిలో వినతి

ASF జిల్లాలోని మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కల్పించాలని TAGS జిల్లా అధ్యక్షురాలు మాలశ్రీ కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని సీఎం ప్రజావాణిలో ప్రజా భవన్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి, మంగి, జోడేఘాట్ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.
News November 14, 2025
గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

రెజోనెన్స్ నిర్వహించిన రెజోఫెస్ట్ 2025 గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. 35 క్యాంపస్‌లకు చెందిన 7,000+ విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. డా. జైతీర్థ్ ఆర్. జోషి, నాగ్ అశ్విన్, శర్వానంద్, సుమా కనకాల వంటి ప్రముఖులు హాజరై విద్యార్థులకు స్ఫూర్తి, సృజనాత్మకత, లక్ష్య సాధన గురుంచి వివరించారు.