News November 14, 2025

అన్నమయ్య: 20 ఎర్రచందనం దుంగలు.. ఇన్నోవా సీజ్

image

అన్నమయ్య జిల్లాలోని శేషచలం అడవుల్లో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లపై అటవీ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటన వీరబల్లి మండలం తాటిగుంటపల్లి సమీపంలో శుక్రవారం జరిగింది. కాగా పోలీసులు ఆపరేషన్‌ నిర్వహించి 20 ఎర్రచందనం దుంగలు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లు పరారయ్యారని రేంజర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. దుంగలు, వాహనం విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుందని రేంజర్ తెలిపారు.

Similar News

News November 14, 2025

ASF: రోడ్డు సౌకర్యం కల్పించండి.. సీఎం ప్రజావాణిలో వినతి

image

ASF జిల్లాలోని మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కల్పించాలని TAGS జిల్లా అధ్యక్షురాలు మాలశ్రీ కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని సీఎం ప్రజావాణిలో ప్రజా భవన్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి, మంగి, జోడేఘాట్ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.

News November 14, 2025

గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

image

రెజోనెన్స్ నిర్వహించిన రెజోఫెస్ట్ 2025 గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. 35 క్యాంపస్‌లకు చెందిన 7,000+ విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. డా. జైతీర్థ్ ఆర్. జోషి, నాగ్ అశ్విన్, శర్వానంద్, సుమా కనకాల వంటి ప్రముఖులు హాజరై విద్యార్థులకు స్ఫూర్తి, సృజనాత్మకత, లక్ష్య సాధన గురుంచి వివరించారు.