News November 14, 2025
జూబ్లీహిల్స్: పడిపోయిన BJP ఓట్ల శాతం!

గత ఎన్నికతో పోల్చితే BJP ఓట్ల శాతం భారీగా తగ్గింది. 2023 అసెంబ్లీ ఎన్నికలో BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 14.11 శాతం అంటే 25,866 ఓట్లు వచ్చాయి. ఈ ఉపఎన్నికలోనూ BJP తరఫున లంకల దీపక్ రెడ్డే పోటీ చేయగా కేవలం 8.76 శాతం అంటే 17,061 ఓట్లు మాత్రమే పోలై డిపాజిట్ గల్లంతైంది. అంటే గత ఎన్నికతో పోల్చితే 8,805 ఓట్లు తగ్గాయి. కాగా రెండు సార్లు BJP మూడో స్థానానికే పరిమితమవడం గమనార్హం.
Similar News
News November 14, 2025
గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

రెజోనెన్స్ నిర్వహించిన రెజోఫెస్ట్ 2025 గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. 35 క్యాంపస్‌లకు చెందిన 7,000+ విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. డా. జైతీర్థ్ ఆర్. జోషి, నాగ్ అశ్విన్, శర్వానంద్, సుమా కనకాల వంటి ప్రముఖులు హాజరై విద్యార్థులకు స్ఫూర్తి, సృజనాత్మకత, లక్ష్య సాధన గురుంచి వివరించారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపుపై కూనంనేని హర్షం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ విజయం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. విజ్ఞతతో ఓటు వేసిన ఓటర్లకు ఆయన ధన్యావాదాలు తెలియజేశారు. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గ పరిధి అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో BJP అభ్యర్థికి డిపాజిట్ గల్లంతయ్యిందన్నారు.
News November 14, 2025
జూబ్లీ తీర్పు: MP కావాలి.. MLA వద్దు!

MP ఎన్నిక, అసెంబ్లీ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 65 వేల ఓట్లు వేసి కిషన్ రెడ్డి గెలుపులో కీలకంగా మారారు. అదే ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు. దీపక్ రెడ్డికి మద్దతుగా కిషన్ రెడ్డి గల్లీ గల్లీ తిరిగినా 17 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. గత GHMC ఎన్నికల్లో ఇదే ఓటర్లు BRSను ఆదరించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలు పార్టీలను చూసి ఓటేస్తున్నారు.


