News November 14, 2025

జూబ్లీహిల్స్: పడిపోయిన BJP ఓట్ల శాతం!

image

గత ఎన్నికతో పోల్చితే BJP ఓట్ల శాతం భారీగా తగ్గింది. 2023 అసెంబ్లీ ఎన్నికలో BJP అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 14.11 శాతం అంటే 25,866 ఓట్లు వచ్చాయి. ఈ ఉపఎన్నికలోనూ BJP తరఫున లంకల దీపక్ రెడ్డే పోటీ చేయగా కేవలం 8.76 శాతం అంటే 17,061 ఓట్లు మాత్రమే పోలై డిపాజిట్ గల్లంతైంది. అంటే గత ఎన్నికతో పోల్చితే 8,805 ఓట్లు తగ్గాయి. కాగా రెండు సార్లు BJP మూడో స్థానానికే పరిమితమవడం గమనార్హం.

Similar News

News November 14, 2025

కలలు కంటూ ఉండండి.. బీజేపీకి టీఎంసీ కౌంటర్

image

బిహార్ ఎన్నికల్లో NDA విజయం నేపథ్యంలో BJP, తృణమూల్ కాంగ్రెస్ మధ్య SMలో మాటల యుద్ధం నడుస్తోంది. బిహార్ తర్వాత బెంగాల్ వంతు అని BJP చేసిన ట్వీట్‌కు TMC కౌంటర్ ఇచ్చింది. BJP కలలు కంటూనే ఉండాలనే అర్థం వచ్చేలా మీమ్ పోస్ట్ చేసింది. నీటి అడుగున కుర్చీలో అస్థిపంజరమున్న ఫొటో షేర్ చేస్తూ ‘బెంగాల్‌లో గెలుపు కోసం BJP ఇంకా ఎదురుచూస్తోంది’ అని ఎద్దేవా చేసింది. 2026లో బెంగాల్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

News November 14, 2025

రాజమండ్రి నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు

image

అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాజమండ్రి నుంచి శబమరిమలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సూపర్ లగ్జరీ బస్సును డీపీటీవో వై.సత్యనారాయణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తిరుపతి, కాణిపాకం, అరుణాచలం మీదుగా శబరిమలకు బస్సులు వెళ్తాయన్నారు. 5రోజులు సాగే ఈ యాత్రకు ఈనెల 15, 17వ తేదీల్లో రాజమండ్రి నుంచి వెళ్తాయని చెప్పారు. డీఎం మాధవ్, పీఆర్వో శివకుమార్ పాల్గొన్నారు.

News November 14, 2025

HYD: 3ఏళ్లకే రికార్డులు కొల్లగొడుతున్న కార్తీక్ సూర్య

image

వనస్థలిపురంలోని IT ఉద్యోగి ప్రశాంత్, నీరజ కొడుకు కార్తీక్ సూర్య(3)కు 16 నెలల వరకు మాటే రాలే. 3 ఏళ్ల వయసులో అంకెలు గుర్తించి తల్లిని అడిగి తెలుసుకునేవాడు. వారి పెంపకంలో రోజుల వ్యవధిలోనే పెద్ద అంకెలతో కూడిక, తీసివేత, శాతాలు చేయడం మొదలెట్టాడు. కఠిన పదాలకు క్షణాల్లో నోటితోనే కచ్చితమైన సమాధానం చెప్తాడు. ఇండియా, నోబుల్, కిడ్స్, తెలంగాణ, తెలుగు, వరల్డ్ వైడ్, కలాం వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నాడు.