News November 14, 2025
టీయూ: ఎంఏ/ ఎంకామ్/ ఎమ్మెస్సీ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ యూనివర్సిటీలో ఎంఎ/ ఎంకామ్/ ఎమ్మెస్సీ నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు ఆదేశాల మేరకు టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కంట్రోలర్, డాక్టర్ నందిని, డాక్టర్ శాంతాబాయి డాక్టర్ తోకల సంపత్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 14, 2025
జగిత్యాల: మెగా జాబ్ మేళా.. 350 మందికి ఉద్యోగాలు

జగిత్యాలలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సహకారంతో ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 1,000 మంది మహిళా నిరుద్యోగులు పాల్గొన్నారు. అందులో 350 మందికి ఉద్యోగాలు లభించాయి. ఎంపికైన వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం విధుల్లో చేరేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
News November 14, 2025
60 పోస్టులకు TSLPRB నోటిఫికేషన్

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులున్నాయి. అభ్యర్థులు ఈ నెల 27 ఉ.8 గంటల నుంచి డిసెంబర్ 15 సా. 5 గంటల వరకు <
News November 14, 2025
చేసిన మంచిని చెప్పుకోలేక ఇబ్బంది పడ్డా: CBN

AP: సంస్కరణలతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని CM CBN తెలిపారు. ఇందుకు HYD అభివృద్ధే ఉదాహరణ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు రూపొందించాలని సూచించారు. తాను చేసిన మంచిని చెప్పుకోవడంలో కొంచెం వెనుకబడడంతో గతంలో ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. గత ఐదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థతో పాటు AP ఇమేజ్ అంతర్జాతీయంగా దెబ్బతిందన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతా తెరుస్తున్నామని తెలిపారు.


