News November 14, 2025

జూబ్లీహిల్స్: సగానికి పైగా ఓటర్లు కాంగ్రెస్ వైపే..!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సగానికి పైగా ఓటర్లు కాంగ్రెస్ వైపే నిలిచారు. పోలైన ఓట్లలో 50.83 శాతం అంటే 98,988 ఓట్లు కాంగ్రెస్‌కు పోల్ అవగా BRSకు 38.13 శాతం అంటే 74,259 ఓట్లు, BJPకి 8.76 శాతం అంటే 17,061 ఓట్లు పోలయ్యాయి. ఇక నోటాకు 0.47 శాతం అంటే 924 ఓట్లు పోలవగా నాలుగో స్థానంలో నిలిచింది. వన్ సైడ్‌గా ఓటర్లంతా తమ వైపే నిలిచారని, బస్తీ బిడ్డ నవీన్ యాదవ్‌కు పట్టం కట్టారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Similar News

News November 14, 2025

రాజమండ్రిలో రేషన్ డీలర్‌పై కేసు నమోదు

image

రాజమండ్రిలోని నెం.39 రేషన్ షాపును ఆర్డీవో కృష్ణనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ అందుబాటు, పంపిణీ రిజిస్టర్లు, ఆన్‌లైన్ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. స్టాక్‌కు ఆన్‌లైన్ రికార్డులకు మధ్య 360 కిలోల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత రేషన్ షాపు డీలర్‌పై నిత్యావసర సరుకుల యాక్ట్ సెక్షన్ 6A కింద కేసు నమోదు చేశారు.

News November 14, 2025

PDPL: సబ్ రిజిష్టర్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

image

పెద్దపల్లి జిల్లా సబ్ రిజిష్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ విజయ కుమార్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిష్టర్ కార్యాలయాల్లో అవినీతి నిర్ములించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి సబ్ రిజిష్టర్ కార్యాలయంలో పలు రికార్డులను, డాక్యుమెంట్లు, ఇతర పాత్రలను పరిశీలిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లను సైతం విచారిస్తున్నారు.

News November 14, 2025

పోలీసులు అలెర్ట్‌గా ఉండాలి: ఎస్పీ

image

ఢిల్లీ పేలుళ్లను దృష్టిలో పెట్టుకొని గుంటూరు జిల్లాలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులకు సూచించారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బందితో వకుల్ జిందాల్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు ఉండే సున్నితమైన ప్రాంతాల‌పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రతీ రెండు నెలలకోసారి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.