News November 14, 2025

RITESలో 252 పోస్టులకు నోటిఫికేషన్

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(<>RITES<<>>) 252 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, BE, B,Tech, B.ARCH , డిప్లొమా, ITI అర్హతగల అభ్యర్థులు NOV 17నుంచి DEC 5వరకు అప్లై చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.rites.com/

Similar News

News November 14, 2025

అవకాశాలను అందిపుచ్చుకోవడంలో CBN టాప్: పీయూష్

image

AP: భవిష్యత్‌ను ముందే ఊహించి CBN అవకాశాలను అందిపుచ్చుకుంటారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ CII సదస్సులో కొనియాడారు. ఒకప్పుడు IT, ఇప్పుడు డ్రోన్లు, స్పేస్, ఏఐ, క్వాంటమ్‌లలో ముందున్నారని చెప్పారు. ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్‌ని తామెప్పుడూ అందిపుచ్చుకుంటూనే ఉంటామని CM తెలిపారు. APలో డ్రోన్ ట్యాక్సీలు తీసుకువచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. డ్రోన్, స్పేస్ సిటీలకు CM, మంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

News November 14, 2025

కాంగ్రెస్‌కు కొత్త నిర్వచనం చెప్పిన PM మోదీ

image

ఇప్పుడున్న కాంగ్రెస్ MMCగా మారిందని బిహార్ విక్టరీ సెలబ్రేషన్స్‌లో ప్రధాని మోదీ విమర్శించారు. ‘MMC అంటే ముస్లింలీగ్ మావోవాది కాంగ్రెస్. ఇతర పార్టీల ఓట్లతో బతకాలని కాంగ్రెస్ చూస్తోంది. ఎన్నికలు వస్తే వేరే పార్టీలనూ ముంచేస్తోంది. ప్రజలకు ఆ పార్టీపై క్రమంగా విశ్వాసం పోతోంది’ అని వ్యాఖ్యానించారు. ఇక బిహార్‌లో ఆర్జేడీ MY(ముస్లిం, యాదవ్) ఫార్ములాను నమ్మితే తాము MY(మహిళా, యూత్)ను నమ్మినట్లు చెప్పారు.

News November 14, 2025

మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవాళ ఒకేరోజు రెండు సార్లు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ ఉదయం రూ.770 తగ్గగా తాజాగా రూ.810 దిగివచ్చింది. దీంతో రూ.1,27,040కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర ఉదయం రూ.700 తగ్గగా ఇప్పుడు రూ.750 తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,16,450గా నమోదైంది. అటు వెండి ధర కేజీపై 100 తగ్గి రూ.1,83,100కు చేరింది.