News November 14, 2025
NRPT: నేటి బాలలే రేపటి పౌరులు: కలెక్టర్

నేటి బాలలే రేపటి పౌరులని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం నారాయణపేట పట్టణంలోని పళ్ళ వీధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలలో ముందుండాలని చెప్పారు. జవహర్ లాల్ నెహ్రూకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టమని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 14, 2025
35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేలు.. వరుసగా 9వ సారి ఎన్నిక!

బిహార్‌లో సీనియర్ నేతలు ప్రేమ్ కుమార్(BJP), బిజేంద్ర ప్రసాద్ యాదవ్(JDU) అరుదైన ఘనత సాధించారు. వరుసగా 9వ సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1990 నుంచి వారు MLAలుగా కొనసాగుతుండటం గమనార్హం. తాజా ఎన్నికల్లో గయా టౌన్ నుంచి 26,423 ఓట్ల మెజారిటీతో ప్రేమ్ కుమార్ గెలవగా, సుపౌల్‌లో 16,448 ఓట్ల ఆధిక్యంతో బిజేంద్ర గెలుపొందారు. దాదాపు 35 ఏళ్లుగా ఇద్దరూ అవే నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం.
News November 14, 2025
ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.
News November 14, 2025
అయోధ్య తరహాలో సింహాచలం డిజైన్ లైటింగ్: గంటా

అయోధ్య తరహాలో సింహాచలానికి డిజైన్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సింహాచలంలో ఆయన పర్యటించారు. BRTS రోడ్డులో రూ.1.37 కోట్లు వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. అడవివరం-పాతగోశాల వరకు లైటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. దేవస్థానానికి రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో సమస్యలు పెరిగాయని, త్వరలో నియామకం జరగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.


