News November 14, 2025

నియోజకవర్గానికో ‘యంగ్ ఇండియా స్కూల్’: Dy.CM

image

దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని Dy.CM భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విజ్ఞాన దర్శిని నిర్వహించిన సైంటిఫిక్ టెంపరమెంట్ సెలబ్రేషన్స్‌లో ఆయన పాల్గొన్నారు. నెహ్రూ హయాంలోనే ఐఐటీల స్థాపన, సైన్స్ అభివృద్ధి జరిగిందని కొనియాడారు. రాష్ట్రంలో వైజ్ఞానిక రంగాభివృద్ధికి ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్స్‌ను స్థాపించడంతో పాటు, IITలను అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు.

Similar News

News November 15, 2025

లిక్కర్ స్కాం నిందితుడు అరెస్ట్.. విజయవాడకు తరలింపు

image

రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన అనిల్ చోకర్ను లిక్కర్ స్కాం కేసులో సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇతడిని 49వ నిందితుడిగా పేర్కొన్నారు. అనిల్‌ చోకర్ ముంబైలో సెల్ కంపెనీలు సృష్టించి, లిక్కర్ స్కాం ద్వారా అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీని వైట్‌గా మార్చాడని సిట్ అభియోగం మోపింది. నిందితుడిని నిన్న ముంబైలో అరెస్టు చేసి, స్థానిక ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు శుక్రవారం విజయవాడకు తరలించారు.

News November 15, 2025

ఇవి సర్‌ప్రైజ్ రిజల్ట్స్: రాహుల్ గాంధీ

image

బిహార్ అసెంబ్లీ ఫలితాలు ఆశ్చర్యపరిచాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియలో మొదటి నుంచీ అన్యాయం జరిగిందని, అందుకే తాము విజయం సాధించలేకపోయామని చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే పోరాటం చేస్తున్నట్లు వివరించారు. ఓటమిపై కాంగ్రెస్, ఇండియా కూటమి లోతుగా సమీక్షించుకుని, మరింత బలంగా తిరిగివస్తామని పేర్కొన్నారు.

News November 15, 2025

నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

NLG : డీసీసీబీలో సహకార వారోత్సవాలు
మిర్యాలగూడ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
NLG : చదువే ధ్యేయంగా బాలికలు ముందుకు సాగాలి
NLG : వెటర్నరీ ఆసుపత్రిలో మందుల కొరత
NLG : చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు
NLG : 17 నుంచి పత్తి కొనుగోళ్లు బంద్
NLG : పోస్ట్ ఆఫీస్ పని వేళల్లో మార్పులు
NLG : యాసంగి ప్రణాళిక @ 6,57,229 ఎకరాలు
చిట్యాల : నల్లగొండ పోలీసుల సూపర్