News November 15, 2025
అరటి రైతు ఆర్తనాదం

అనంతపురం జిల్లాలో అరటి రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టాలను ఎదుర్కొంటున్నారు. పంటకు కనీస మద్దతు ధర లేక, కొనేవారు కరువై దయనీయ స్థితి నెలకొంది. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకే ఢిల్లీ మార్కెట్‌కు అరటి చేరుతుండటంతో స్థానిక వ్యాపారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో 15వేల హెక్టార్లలో పంట సాగులో ఉండగా, టన్ను ధర రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకే ఉండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 15, 2025
పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లాలో పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఆమె సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల అధ్యయన పద్ధతులు, బోధనా ప్రమాణాల మెరుగుదలపై కలెక్టర్ మార్గదర్శకాలు ఇచ్చారు.
News November 15, 2025
కొడంగల్‌లో ఎడ్యుకేషన్ హబ్ ఉట్టి మాటేనా.?

విద్యా సంస్థల ఏర్పాటుతో కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతోందనే ప్రచారం సాగుతోంది. మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాలు లగచర్లకు తరలింపు సరైంది కాదని, ఇక్కడే ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లిలో మెడికల్ కాలేజీకి భూమిని సేకరించారు. అంతలోనే లగచర్ల, హకీమ్‌పేట్‌కు తరలించడంతో స్థానికంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
News November 15, 2025
NZB: గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఎండు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని భావం సాహెబ్ పాడ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అమీర్ ఖాన్ అనే వ్యక్తి బైక్‌పై 260 గ్రాముల ఎండు గంజాయిని తరలిస్తూ పట్టుబడినట్లు పేర్కొన్నారు.


