News November 15, 2025
జగిత్యాల: గంజాయి కేసులో ముగ్గురికి 7 ఏళ్ల జైలు

జగిత్యాల పట్టణ పోలీస్ దర్యాప్తులో బయటపడ్డ గంజాయి పెంపకం, సరఫరా కేసులో ముగ్గురికి జిల్లా ఫస్ట్ అదనపు సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ 7 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు. నిందితులు మేకల రాజు, సాయి, చందు 250 గ్రాముల గంజాయి వ్యాపారంలో ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.
Similar News
News November 15, 2025
కామారెడ్డి: ఆన్‌లైన్ టాస్క్‌ల పేరుతో రూ.2.74 లక్షల టోకరా

టెలిగ్రామ్‌లో వచ్చిన లింకును ఓపెన్ చేసి దోమకొండకు చెందిన వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యారు. ‘గుబిభో’ అనే యాప్‌లో టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని నమ్మించారు. కొన్ని టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు క్రెడిట్ అయినట్లు స్క్రీన్ షాట్‌లు చూపించారు. డబ్బు ఖాతాలోకి బదిలీ చేసుకోవాలంటే కొంత మొత్తం చెల్లించాలని సూచించారు. దీంతో బాధితుడు రూ.2.74 లక్షలు పంపించాడు. మోసపోయానని గ్రహించి PSను ఆశ్రయించాడు.
News November 15, 2025
పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లాలో పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఆమె సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల అధ్యయన పద్ధతులు, బోధనా ప్రమాణాల మెరుగుదలపై కలెక్టర్ మార్గదర్శకాలు ఇచ్చారు.
News November 15, 2025
కొడంగల్‌లో ఎడ్యుకేషన్ హబ్ ఉట్టి మాటేనా.?

విద్యా సంస్థల ఏర్పాటుతో కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతోందనే ప్రచారం సాగుతోంది. మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాలు లగచర్లకు తరలింపు సరైంది కాదని, ఇక్కడే ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లిలో మెడికల్ కాలేజీకి భూమిని సేకరించారు. అంతలోనే లగచర్ల, హకీమ్‌పేట్‌కు తరలించడంతో స్థానికంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.


