News November 15, 2025

MHBD: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు: CI

image

విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు. MHBD పట్టణం కంకర బోర్డులో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న రవి అనే ఉపాధ్యాయుడు గత పదిరోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలి తల్లితో చెప్పింది. దీంతో టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Similar News

News November 15, 2025

కామారెడ్డి: ఆన్‌లైన్ టాస్క్‌ల పేరుతో రూ.2.74 లక్షల టోకరా

image

టెలిగ్రామ్‌లో వచ్చిన లింకును ఓపెన్ చేసి దోమకొండకు చెందిన వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యారు. ‘గుబిభో’ అనే యాప్‌లో టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని నమ్మించారు. కొన్ని టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు క్రెడిట్ అయినట్లు స్క్రీన్ షాట్‌లు చూపించారు. డబ్బు ఖాతాలోకి బదిలీ చేసుకోవాలంటే కొంత మొత్తం చెల్లించాలని సూచించారు. దీంతో బాధితుడు రూ.2.74 లక్షలు పంపించాడు. మోసపోయానని గ్రహించి PSను ఆశ్రయించాడు.

News November 15, 2025

పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఆమె సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల అధ్యయన పద్ధతులు, బోధనా ప్రమాణాల మెరుగుదలపై కలెక్టర్ మార్గదర్శకాలు ఇచ్చారు.

News November 15, 2025

కొడంగల్‌లో ఎడ్యుకేషన్ హబ్ ఉట్టి మాటేనా.?

image

విద్యా సంస్థల ఏర్పాటుతో కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుందని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతోందనే ప్రచారం సాగుతోంది. మెడికల్ కళాశాల, సమీకృత గురుకులాలు లగచర్లకు తరలింపు సరైంది కాదని, ఇక్కడే ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొడంగల్ మండలంలోని అప్పాయిపల్లిలో మెడికల్ కాలేజీకి భూమిని సేకరించారు. అంతలోనే లగచర్ల, హకీమ్‌పేట్‌కు తరలించడంతో స్థానికంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.