News November 15, 2025
బిక్కనూర్: అనారోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బిక్కనూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ప్రకారం.. బిక్కనూర్‌కు చెందిన తిరుమల రాజయ్య(75) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
Similar News
News November 15, 2025
సంగారెడ్డి: ఈనెల 23న ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 23న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షను నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని అన్నారు. ఈ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనుందని పేర్కొన్నారు.
News November 15, 2025
పాపం తేజస్వీ.. సీఎం అవుదామనుకుంటే?

బిహార్ అసెంబ్లీ ఎన్నికల <<18289323>>ఫలితాలు<<>> RJD నేత తేజస్వీ యాదవ్‌కు పీడకలను మిగిల్చాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ 75 చోట్ల విజయం సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లో మరిన్ని సీట్లు పెరుగుతాయని, తమ కూటమి అధికారంలోకి వస్తుందని తేజస్వీ భావించారు. అంతేకాకుండా ఈసారి సీఎం కుర్చీ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజలు ఆర్జేడీకి 25 సీట్లు మాత్రమే కట్టబెట్టి ముఖ్యమంత్రి కావాలన్న తేజస్వీ ఆశలను ఆవిరి చేశారు.
News November 15, 2025
ప్రణాళిక ప్రకారం నిర్వహించాలి: MHBD కలెక్టర్

ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని, ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా కేంద్రాలను, వసతి గృహాలను పరిశీలించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. జిల్లా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై కలెక్టర్ శుక్రవారం వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


