News November 19, 2025
రాష్ట్రపతి పర్యటన.. రేణిగుంటలో విస్తృత తనిఖీలు

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుపతి పర్యటనను దృష్టిలో పెట్టుకుని రేణిగుంట పట్టణంలో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఉన్నాధికారుల ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు పట్టణంలోని లాడ్జీలు, హోటళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అతిథుల నమోదు, సీసీ కెమెరాలు, భద్రతా పరికరాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులపై వివరాలు సేకరించారు. లాడ్జ్ నిర్వాహకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు.
Similar News
News March 12, 2026
కడప: నేటి ఇంటర్ 1st ఇయర్ పరీక్షలకు 92% విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో గురువారం 59 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ కామర్స్ పేపర్-1 పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు 92% విద్యార్థులు హాజరయ్యారు. 3,226 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 2,956 మంది హాజరయ్యారు. 270 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు. నేటి పరీక్షలకు ఒకేషనల్ విద్యార్థులు లేరు. నేటి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ మీడియట్ అధికారులు తెలిపారు.
News March 12, 2026
సముద్ర గర్భంలో మృత్యుపాశాలు!

సముద్ర గర్భంలో దాగి ఉండే ‘నావికా దళ మైన్స్’ అత్యంత ప్రమాదకరమైనవి. తాజాగా హార్ముజ్ జలసంధిలో ఇరాన్ వీటిని మోహరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి నౌకలను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. ఓడల శబ్దం లేదా అయస్కాంత సెన్సార్ల ద్వారా ఇవి పేలుతాయి. అత్యంత ఆధునికమైన రైజింగ్ టార్పెడో, ఇన్‌ఫ్లుయెన్స్ మైన్స్ శబ్దాన్ని పసిగట్టి దాడులు చేస్తాయి. శత్రువును ముంచడమే కాదు, సముద్ర ప్రయాణాన్నే అసాధ్యం చేయగల సత్తా వీటికి ఉంది.
News March 12, 2026
మణుగూరు: బ్రెయిన్ ట్యూమర్‌తో బీటెక్ విద్యార్థిని మృతి

మణుగూరు పట్టణంలోని చాకలి ఐలమ్మ నగర్‌కు చెందిన రాపర్తి అనూష అనే బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థిని బ్రెయిన్ ట్యూమర్‌తో మృతి చెందింది. ఇటీవల టైఫాయిడ్ జ్వరం రావడంతో వ్యాధి మెదడుకు వ్యాపించి పరిస్థితి విషమించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.


