News November 28, 2025
అమరావతిలో 2వ దశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం

అమరావతిలో రెండోవ దశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 7 గ్రామాల పరిధిలో 16.666.5 ఎకరాల సమీకరణ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. పల్నాడు (D) అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాలు కాగా, గుంటూరు (D) తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో భూ సమీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Similar News
News December 2, 2025
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. నిన్న మీ ప్రాంతంలో వర్షం పడిందా?
News December 2, 2025
NRPT: రెండో రోజు 202 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు

రెండవ విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సోమవారం నారాయణపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొత్తం 202 మంది సర్పంచ్ స్థానాలకు, 404 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దామరగిద్ద మండలంలో 56, ధన్వాడ 43, మరికల్ 41, నారాయణపేట మండలంలో 62 మంది నామినేషన్లు వేశారు. రెండు రోజుల్లో మొత్తం 261 సర్పంచ్ స్థానాలకు, 513 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు అయ్యాయి.
News December 2, 2025
హనుమద్వ్రతం ఎందుకు చేయాలి?

హనుమద్వ్రత ఫలితం కార్యసాధనకు తోడ్పడుతుందని, పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తుందని పండితులు చెబుతున్నారు. ‘స్వామిని మనసారా స్మరిస్తే ధైర్యం చేకూరి కార్యోన్ముఖులు అవుతారు. సకల భయాలూ నశిస్తాయి. గ్రహ పీడలు, పిశాచ బాధలు దరిచేరవు. మానసిక వ్యాధులు తొలగిపోయి, మనసులో ప్రశాంతత, సానుకూలత నెలకొంటాయి. ఇది విజయాన్ని, శాంతిని, రక్షణను ఏకకాలంలో ప్రసాదించే శక్తివంతమైన వ్రతం’ అని అంటున్నారు. జై హనుమాన్!


