News November 28, 2025
బాసర RGUKTకి స్కిల్ డెవలప్‌మెంట్ లీడర్‌షిప్ అవార్డు

బాసర RGUKT కళాశాలకు ‘స్కిల్ డెవలప్‌మెంట్ లీడర్‌షిప్ అవార్డు-2025’ లభించింది. విద్యార్థుల ఉద్యోగ నియామకాలలో అంతర్జాతీయ, ప్రభుత్వ ఉద్యోగాలలో భాగస్వామ్యం, పరిశోధన, సాంకేతికత, యువ నాయకత్వం వంటి అంశాలలో గణనీయమైన పురోగతి సాధించినందుకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడం పట్ల కళాశాల ఉద్యోగులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News December 2, 2025
ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నా: సీఎం

ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎంతో మంది ఉద్దండులను అందించిన ఓయూని కేసీఆర్ కాల గర్భంలో కలిపేశారు. యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఎంతైనా ఖర్చు చేస్తా’ అని చెప్పారు. కాగా ఇప్పటికే ఓయూని సందర్శించిన రేవంత్ రెడ్డి భారీగా నిధులు కేటాయిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
News December 2, 2025
టీటీడీ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి అర్హతల నిర్ణయం

టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి నియామకంలో కొన్ని అర్హతలకు సంబంధించి సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సంస్కృతం, తమిళం, తెలుగు భాషల మీద పట్టు, పీహెచ్డీతో పాటు మరికొన్ని అర్హతలు కలిగి ఉండాలంది. నేరుగా నియామకం లేదా డిప్యూటేషన్ ద్వారా నియామకం చేసుకోవచ్చని జీవోలో పేర్కొంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని సూచించారు.
News December 2, 2025
సైబర్ నేరాలకు ‘ఫుల్‌స్టాప్’.. అవగాహనతోనే పరిష్కారం

మారుతున్న సాంకేతిక యుగంలో సైబర్ నేరాలపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అన్నారు. సైబర్ క్రైమ్ ఠాణాలో ‘ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్ – సైబర్ క్లబ్’ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, పోస్టర్ రిలీజ్ చేశారు. విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్‌లు ముందుకు వచ్చి సైబర్ సేఫ్టీ అంబాసిడర్లుగా ఎదగాలని సీపీ పిలుపునిచ్చారు.


