News November 29, 2025

జగిత్యాల: నువ్వులు క్వింటాల్ @8,036

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2311, కనిష్ఠ ధర రూ.1800; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2101, కనిష్ఠ ధర రూ.2040; వరి ధాన్యం (BPT) ధర రూ.2061; వరి ధాన్యం (HMT) ధర రూ.2252; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2978, కనిష్ఠ ధర రూ.2221; నువ్వుల ధర రూ.8036గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.

Similar News

News December 2, 2025

ఫోన్లలో Govt యాప్.. నిఘా కోసమేనా?

image

ఫోన్లలో ప్రభుత్వ ‘సంచార్ సాథీ’ యాప్‌ <<18439451>>డిఫాల్ట్‌గా<<>> ఉండాలన్న కేంద్రం నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నేరాలకు అడ్డుకట్ట వేసే పేరుతో ప్రజలపై నిఘా పెట్టాలనుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రష్యా, నార్త్ కొరియా వంటి దేశాల్లోనే డిలీట్ చేసేందుకు వీలులేని ఇలాంటి యాప్స్ ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నార్త్ కొరియాలా తమపై నిఘా పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?

News December 2, 2025

ఉత్తరాంధ్రలో పెరిగిన కాలుష్యం

image

ఉత్తరాంధ్రలోని మూడు నగరాల్లో కాలుష్యం పెరిగింది. సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో హిందూపూరం MP పార్థసారథి అడిగిన ప్రశ్నకి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు. 2017-18తో పోలిస్తే 2024-25లో ఉత్తరాంధ్రలో గాలి నాణ్యత మరింత దిగజారింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళంలో పరిశ్రమలు వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్ల కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

News December 2, 2025

విష్ణు నామాల్లోనే ఆయన గొప్పతనం

image

అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః|
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థివిరో ధ్రువః||
కొలవలేనంత గొప్పతనం కలిగిన అప్రమేయుడు, మనస్సుకు అధిపతి అయిన హృషీకేశుడు, దేవతలకు రాజైన సురప్రభువు, సృష్టిని నిర్మించిన విశ్వకర్మ, మన పాలకుడైన మనువు, రూపాలను తీర్చిదిద్దే త్వష్టా, అతి స్థిరమైన స్థవిష్ఠుడు, ధ్రువుడు, అతి పెద్దవాడైన స్థవిరుడు, నాభి నుంచి పద్మం కలిగిన పద్మనాభుడు ఆ విష్ణుమూర్తే. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>