News December 6, 2025
GDK నుంచి అరుణాచలం, రామేశ్వరానికి స్పెషల్ యాత్ర

GDK నుంచి రామేశ్వరానికి 7 రోజుల ప్రత్యేక యాత్రను ఏర్పాటు చేశారు. ఈ యాత్ర డిసెంబర్ 15న GDK బస్టాండు నుంచి ప్రారంభమై DEC 21న తిరిగి చేరుకుంటుంది. యాత్రలో భాగంగా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశెంబు, మధురై, రామేశ్వరం, కాంచీపురం, జోగులాంబ లాంటి పుణ్యక్షేత్రాలను దర్చించుకోవచ్చని, ఒక్కరికి ఛార్జీ రూ.8,000గా ఉంటుందని డిపో DM నాగభూషణం తెలిపారు. టికెట్ల రిజర్వేషన్ కొరకు 7013504982 సంప్రదించవచ్చు.
Similar News
News December 7, 2025
జ్యోతిషుడి సలహా.. బీబీనగర్ సర్పంచ్ బరిలో భార్యాభర్తలు

బీబీనగర్ సర్పంచ్ ఎన్నికల బరిలో నారగొని మహేష్ గౌడ్ తన భార్య శ్రీలతతో కలిసి పోటీకి దిగారు. జ్యోతిషుడి ఇచ్చిన సలహా మేరకు, భార్యాభర్తలు ఇద్దరూ బరిలో ఉంటే విజయం ఖాయమని భావించి, ఆయన శ్రీలతను నామినేషన్ వేయించారు. అధికారులు విడుదల చేసిన బ్యాలెట్ పత్రాల్లో ఇద్దరి పేర్లు ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. విజయం ఎవరికి దక్కుతుందోనని గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News December 7, 2025
నంద్యాల: పెళ్లి అయిన నెలకే యువకుడి సూసైడ్

అనంత(D) యాడికి మండలం నగరూరుకు చెందిన శరత్‌కుమార్(25) కొలిమిగుండ్ల జగనన్న కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి తన మిత్రుడు హరీశ్ ఇంటికి వచ్చిన శరత్.. శనివారం హరీశ్ డ్యూటీకి వెళ్లిన తర్వాత విషగుళికలు మింగాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని అనంతపురం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. శరత్ గత నెలలో బళ్లారిలో వివాహం చేసుకుని, బెంగళూరులో ప్రైవేట్ జాబ్‌లో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 7, 2025
కృష్ణా: స్క్రబ్ టైఫస్‌తో వ్యక్తి మృతి

ఉయ్యూరు మండలం ముదునూరుకి చెందిన శివశంకర్ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరణించారు. ఈ నెల 2న శాంపిల్స్ తీసుకోగా, రిపోర్ట్ రాకముందే 4వ తేదీన ఆయన మృతి చెందారు. శనివారం వచ్చిన రిపోర్టుల్లో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో జిల్లా వైద్య బృందం సర్వే చేపట్టింది.


