News December 6, 2025

జిల్లాలో 23,719 PMUY కనెక్షన్లు.. MP ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం

image

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(PMUY) కింద ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో 9.71 లక్షల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వబడినట్లు కేంద్ర మంత్రి సురేష్ గోపి లోక్ సభలో వెల్లడించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ వివరాలను తెలియజేశారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ఈ గణాంకాలను అందించారు. ఈ గణాంకాల ప్రకారం, ఏలూరు జిల్లాలో 23,719 ఉచిత కనెక్షన్లు మంజూరు చేయబడ్డాయని వెల్లడించారు.

Similar News

News December 7, 2025

అచ్చంపేట: రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలి: తాహశీల్దార్

image

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తహశీల్దార్ సైదులు అన్నారు. రేషన్ షాపులు ప్రతి నెల 1వ తేది నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరచి ఉంచాలన్నారు. రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

News December 7, 2025

రెండేళ్ల పాలనలో చేసింది మోసమే: కిషన్ రెడ్డి

image

TG: హామీలు అమలు చేయకుండా రేవంత్ ఉత్సవాలు చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ‘CM చెప్పేది ఫ్రీ బస్సు, సన్నబియ్యం గురించే. KG బియ్యంలో కేంద్రం ₹43 భరిస్తోంది. పోలీసుల్ని పెట్టుకొని గ్రామాల్లో తిరగడం కాదు. హామీలపై చర్చకు రండి’ అని సవాల్ విసిరారు. రెండేళ్ల పాలనలో అందర్నీ మోసగించారని విమర్శించారు. మహాధర్నాలో నేతలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన ఛార్జిషీట్ విడుదల చేశారు.

News December 7, 2025

విశాఖ: మహిళ దారుణ హత్య

image

పెందుర్తిలోని సుజాతనగర్‌లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీకాకుళానికి చెందిన దేవి,శ్రీనివాస్ సుజాతనగర్‌లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య శనివారం రాత్రి వివాదం చోటుచేసుకోగా ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల శ్రీనివాస్‌పై రైస్ పుల్లింగ్‌ కేసులో అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు.