News December 6, 2025
కార్డియాలజిస్టుల నియామకానికి కృషి: మంత్రి సుభాష్

కాకినాడ GGHలో కార్డియాలజీ విభాగంలో వైద్యుల నియామకం చేపట్టేందుకు కృషి చేస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శనివారం ఆయన GGHను ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు వార్డులను పరిశీలించారు. కార్డియాలజిస్టులు లేని విషయాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
Similar News
News December 9, 2025
జిల్లాలో 15, 16న ఎస్టిమేట్స్ కమిటీ పర్యటన: కలెక్టర్

రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ ఈనెల 15, 16న రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈనెల 15 సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారన్నారు. 16న మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌లో తనతోపాటు ఇతర అధికారులతో ఎస్టిమేట్స్ కమిటీ 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సం.ల బడ్జెట్ అంచనాలపై సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు.
News December 9, 2025
సినిమా వాయిదా..! దర్శకుడి ఎమోషనల్ పోస్ట్

‘మోగ్లీ’ రిలీజ్ వాయిదా అంటూ ప్రచారం నడుమ డైరెక్టర్ సందీప్ రాజ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘అంతా సర్దుకుందనుకుంటున్న టైంలో మోగ్లీ చిత్ర విడుదలకు బ్యాడ్ లక్ ఎదురవుతోంది. డైరెక్టర్ సందీప్ రాజ్ అనే టైటిల్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడాలనుకున్న కల రోజురోజుకూ కష్టమవుతోంది. వెండితెరకు నేను ఇష్టం లేదేమో. అంకితభావంతో పనిచేసిన రోషన్, సరోజ్, సాక్షి వంటి వారికోసమైనా అంతా మంచి జరగాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.
News December 9, 2025
నకిలీ కాల్ సెంటర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణరావు నకిలీ కాల్ సెంటర్ల మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. తెలియని కస్టమర్ కేర్ నంబర్లను నమ్మవద్దని, అధికారిక వెబ్‌సైట్లలోనే వివరాలు చూడాలని సూచించారు. ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పరాదని స్పష్టం చేశారు. మోసపోయిన వారు వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.


