News December 7, 2025
భూపాలపల్లి: మారుతున్న కండువాలు..!

జిల్లాలో 248 పంచాయతీలు, 2,102 వార్డులు ఉన్నాయి. మొదటి దశలో గణపురం, రేగొండ, గోరి కొత్తపల్లి , మొగుళ్లపల్లి మండలంలో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. నాలుగు, ఐదు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని చేరికలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే సత్యనారాయణ రావు, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గ్రామాల్లో అభ్యర్థులను గెలిపించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
Similar News
News December 9, 2025
గన్నవరం-ఢిల్లీ ఇండిగో సర్వీస్ ఈ నెల 11 వరకు రద్దు

విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో రెగ్యులర్ సర్వీసులను ఆపరేషనల్ కారణాల వల్ల డిసెంబర్ 11 వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ ప్రకటించింది. విమానం రద్దు కావడంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీషెడ్యూల్ లేదా రిఫండ్ కోసం కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని ఇండిగో సూచించింది.
News December 9, 2025
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్‌లో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్‌లో 14 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ(ఫిజిక్స్, మ్యాథ్స్, జియోఫిజిక్స్,జియాలజీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్), ఎంఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిసెంబర్ 15లోపు దరఖాస్తు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్‌సైట్: https://iigm.res.in/
News December 9, 2025
ఫ్యూచర్ సిటీలో ‘రేసింగ్ & మోటోక్రాస్’ కేంద్రం

TG: భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ-ప్రామాణిక ‘రేసింగ్ & మోటోక్రాస్’ కొలువుదీరనుంది. ఈ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ‘సూపర్‌క్రాస్ ఇండియా’ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీనిలో డర్ట్ ట్రాక్‌లు, రైడర్ శిక్షణ, ఇతర మౌలిక సదుపాయాలను కంపెనీ ఏర్పాటుచేయనుంది. ఇందులో ప్రపంచ రేసింగ్, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లను నిర్వహిస్తారు. భూమి, ఇతర ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుంది.


