News December 7, 2025

జనగామ: ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: DCP

image

జనగామ జిల్లాలో మూడు విడతలుగా జరగబోయే ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని DCP రాజమహేంద్రనాయక్‌ తెలిపారు. ఈ సందర్భంగా DCP మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు, ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం, డబ్బు పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారితో పాటు గ్రూప్‌ అడ్మిన్‌పై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Similar News

News December 9, 2025

జిల్లాలో 15, 16న ఎస్టిమేట్స్ కమిటీ పర్యటన: కలెక్టర్

image

రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ ఈనెల 15, 16న రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈనెల 15 సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారన్నారు. 16న మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్‌లో తనతోపాటు ఇతర అధికారులతో ఎస్టిమేట్స్ కమిటీ 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సం.ల బడ్జెట్ అంచనాలపై సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు.

News December 9, 2025

సినిమా వాయిదా..! దర్శకుడి ఎమోషనల్ పోస్ట్

image

‘మోగ్లీ’ రిలీజ్ వాయిదా అంటూ ప్రచారం నడుమ డైరెక్టర్ సందీప్ రాజ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘అంతా సర్దుకుందనుకుంటున్న టైంలో మోగ్లీ చిత్ర విడుదలకు బ్యాడ్ లక్ ఎదురవుతోంది. డైరెక్టర్ సందీప్ రాజ్ అనే టైటిల్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడాలనుకున్న కల రోజురోజుకూ కష్టమవుతోంది. వెండితెరకు నేను ఇష్టం లేదేమో. అంకితభావంతో పనిచేసిన రోషన్, సరోజ్, సాక్షి వంటి వారికోసమైనా అంతా మంచి జరగాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.

News December 9, 2025

నకిలీ కాల్ సెంటర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణరావు నకిలీ కాల్ సెంటర్ల మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. తెలియని కస్టమర్ కేర్ నంబర్లను నమ్మవద్దని, అధికారిక వెబ్‌సైట్లలోనే వివరాలు చూడాలని సూచించారు. ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పరాదని స్పష్టం చేశారు. మోసపోయిన వారు వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.