News December 8, 2025
పల్నాడు: కంటతడి పెట్టించిన తల్లి ఆక్రందన

వినుకొండకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుందుర్తి హనుమత్ శాండిల్య (32) విహారయాత్ర నిమిత్తం అస్సాం వెళ్లి, ఈ నెల 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. యువకుడి మృతదేహం ఆదివారం వినుకొండ చేరుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులైన తల్లిదండ్రులు రవి, రమాదేవి తమ ఏకైక కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ‘అమ్మతో ఒక్కసారి మాట్లాడయ్య’ అంటూ ఆ తల్లి చేసిన ఆక్రందన అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
Similar News
News December 10, 2025
తిరుపతి ఐజర్‌లో ఉద్యోగావకాశం

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి ఐజర్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా లేబరోటరీ అసిస్టెంట్-1 పోస్టుకు 13వ తేదీ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్/ డిప్లమా ఇన్ M.L.T పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఇతర వివరాలకు www.iisertirupati.ac.in/jobs/advt_762025/ వెబ్ సైట్ చూడాలి.
News December 10, 2025
పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: EC

గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఈ మేరకు ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలోని 6 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
News December 10, 2025
న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా: పవన్ కళ్యాణ్

DMK ఆధ్వర్యంలోని ఇండీ కూటమి MPలు మద్రాస్ హైకోర్టు జడ్జిపై అభిశంసన నోటీసు ఇవ్వడాన్ని AP Dy.CM పవన్ ఖండించారు. “ఇది న్యాయవ్యవస్థ మొత్తాన్ని భయపెట్టే యత్నం కాదా? ఇలాంటప్పుడు భక్తులు తమ ఆలయాలను, మత వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు, రాజకీయ ద్వేషంతో ప్రేరితమైన న్యాయ దుర్వినియోగాలకు గురవకుండా ఉండేందుకు ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు దేశానికి అత్యవసరం” అని <


