News December 9, 2025

పార్వతీపురం: మంత్రి చుట్టూ రోజుకో వివాదం.. పూటకో రగడ

image

మంత్రి సంధ్యారాణి చుట్టూ రోజుకో వివాదం నడుస్తోంది. ఇటీవల పచ్చకామెర్లతో గురుకుల పాఠశాల విద్యార్థులు మృతి చెందడంతో మంత్రిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మంత్రి PA వేధిస్తున్నాడని సాలూరుకు చెందిన మహిళ పోలీసులుకి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. తాజాగా తన తల్లి <<18505977>>మరణానికి<<>> మంత్రి అనుచరుడి వేధింపులే కారణమని ఓ మహిళ కలెక్టర్‌కి ఫిర్యాదు చేసింది. మంత్రి అనుచరుల వల్ల ఆమెకు చెడ్డపేరు వస్తోందని లోకల్ టాక్.

Similar News

News December 10, 2025

తిరుపతి: కళ్లు లేకున్నా.. 200KM స్కేటింగ్

image

తిరుపతి జిల్లాకు చెందిన అంధ స్కేటర్ మురారి హర్షవర్ధన్‌ నాన్‌స్టాప్‌గా 200 KM బ్లైండ్ స్కేటింగ్ మారథాన్ చేశాడు. ఆర్టిస్టిక్, మల్టీటాస్క్ విభాగాల్లో ప్రపంచ రికార్డులు సాధించాడు. సంబంధిత సర్టిఫికెట్లను తిరుపతిలో మంగళవారం సాయంత్రం బాలుడికి అందజేశారు. వండర్ బుక్, జీనియస్ బుక్, వజ్ర రికార్డ్స్ ప్రతినిధులు పురస్కారాలు ఇచ్చారు. హర్షవర్ధన్ అందరికీ ఆదర్శమని పలువురు పేర్కొన్నారు.

News December 10, 2025

శరీరంలో ఈ మార్పులు వస్తే జాగ్రత్త!

image

చాలా మంది కిడ్నీ సమస్యలను త్వరగా గుర్తించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వచ్చే కొన్ని మార్పులను గమనించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ లేదా రాత్రి వేళల్లో అతి మూత్రం, మూత్రంలో నురుగు/ఎర్రటి రంగు, ముఖం/పాదాలు లేదా శరీరం ఉబ్బినట్లు అనిపిస్తే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. బీపీ పెరుగుతున్నా కిడ్నీ సమస్యలుగా గుర్తించాలని చెబుతున్నారు.

News December 10, 2025

నాగార్జున సాగర్@70ఏళ్లు

image

కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టల్లో నాగార్జున సాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీనికి శంకుస్థాపన చేసి నేటికి 70 ఏళ్లు. 1955 DEC 10న ఆనాటి PM నెహ్రూ పునాది రాయి వేశారు. 1967లో ఇందిరా గాంధీ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. 1911లోనే నిజాం ఈ ప్రాంతంలో ఆనకట్ట కట్టాలని అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. సాగర్ నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందుతోంది.