News December 9, 2025
ఆ ఘటన నన్ను కలవరపెడుతోంది: తిరుపతి కలెక్టర్

కేవీబీపురం మండలం కళత్తూరులో జరిగిన విధ్వంసాన్ని తన సర్వీసులో ఎన్నడూ చూడలేదని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. నిద్రలో కూడా ఆ ఘటన తనన కలవరపెడుతోందని చెప్పారు. పుత్తూరు డీఎస్పీ, రూరల్ సీఐ, కేవీబీపురం ఎస్ఐలు పెద్ద ప్రమాదం నుంచి ప్రజలను అప్రమత్తం చేశారని కొనియాడారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు అధికారుల బాగా పనిచేశారన్నారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
Similar News
News December 9, 2025
నల్గొండ: పీజీ విద్యార్థులకు గమనిక

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ (M.A/M.Com/M.Sc/M.S.W) సెమిస్టర్-3 పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించినట్లు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 15వ తారీకు, అపరాధ రుసుముతో ఈనెల 17వ తారీకు వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
News December 9, 2025
భూ సర్వే రోవర్‌లను సిద్ధం చేయాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రోవర్స్ పనితీరును మంగళవారం పరిశీలించారు. జిల్లాలో మొత్తం 114 రోవర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిలో 42 మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. మిగిలిన వాటిలో కొన్ని రీఛార్జి చేయవలసి ఉండగా, మరికొన్ని రిపేర్లు చేయవలసినవి ఉన్నాయని సంబంధిత అధికారులు జేసీకి వివరించారు. రోవర్లకు రీఛార్జ్ చేసుకొని, రిపేర్లు ఉంటే చూసుకోవాలని జేసీ సూచించారు.
News December 9, 2025
స్వాతంత్ర్య సమరాన్ని BJP వ్యతిరేకించింది: ఖర్గే

స్వాతంత్ర్య సమరం, దేశభక్తి గీతాలను వ్యతిరేకించిన చరిత్ర బీజేపీదని AICC చీఫ్ ఖర్గే విమర్శించారు. ‘గాంధీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో వందేమాతరం అంటూ లక్షల మంది స్వాతంత్ర్య సమరయోధులు జైలుకు వెళ్లారు. అప్పుడు BJP సిద్ధాంతకర్తలు బ్రిటీషర్ల కోసం పనిచేస్తున్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన వందేమాతరం ఉద్యమంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించింది’ అని ఖర్గే రాజ్యసభలో వ్యాఖ్యానించారు.


