News December 9, 2025

పార్వతీపురం: ‘క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమం’

image

పార్వతీపురం జిల్లాలోని పాఠశాల నుంచి కళాశాల స్థాయిలో గల క్రీడాకారులను, ప్రతిభావంతులను గుర్తించేందుకు ప్రత్యేక క్రీడా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. మన్యం జిల్లాలో క్రీడాకారులకు, ప్రతిభ ఉన్నవారికి కొదవలేదన్నారు. కళాకారులను ప్రోత్సహించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టమన్నారు.

Similar News

News December 9, 2025

చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే: పేర్ని నాని

image

AP: వ్యవసాయం, ధాన్యాగారంగా APకి ఉన్న బ్రాండును దెబ్బతీసింది CM చంద్రబాబేనని మాజీమంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రైతును గుడ్డికన్నుతో చూడటం చంద్రబాబు విధానం. ఆయన ఎప్పటికీ రైతు వ్యతిరేకే. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. 18నెలల్లోనే రూ.2.66లక్షల కోట్ల అప్పుచేశారు. అప్పులు తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? దేశ GDPలో AP వాటా ఎంత?’ అని ప్రశ్నించారు.

News December 9, 2025

ప్రకాశం డీఈవో కిరణ్ కుమార్ బదిలీ

image

ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఈవోల సాధారణ బదిలీలలో ప్రకాశం జిల్లా డీఈవో కిరణ్ కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ కళాశాలకు బదిలీ కాగా, ఆయన స్థానంలో గుంటూరు జిల్లా డీఈవో సీవీ రేణుక నియమితులయ్యారు. త్వరలోనే ప్రకాశం డీఈవోగా రేణుక బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

News December 9, 2025

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో క్రీడల ద్వారా ప్రతిభ: కలెక్టర్

image

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో నమ్మకం, ధైర్యం, ప్రతిభను వెలికి తీయడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. రాజమండ్రిలోని ఎస్‌కేవీటీ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను కమిషనర్ ప్రారంభించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారుల్లో అపారమైన సృజనాత్మకత, ప్రత్యేక కౌశలాలు దాగి ఉన్నాయని వారు పేర్కొన్నారు.