News December 9, 2025
అయ్యప్ప భక్తులకు కేరళ అటవీశాఖ అలర్ట్

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ అటవీశాఖ అలర్ట్ జారీ చేసింది. అయ్యప్ప ఆలయానికి సమీపంలో ఉన్న ఉరక్కుళి జలపాతం వద్దకు వెళ్లొద్దని సూచించింది. ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరగడం, ఏనుగులు, వన్యప్రాణుల సంచారం కూడా పెరగడం, ఆ మార్గం ఏటవాలుగా, జారుడుగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ఈ సూచనలు చేసింది. సాధారణంగా అడవిలో నడుచుకుంటూ వెళ్లే భక్తులు ఈ జలపాతం వద్ద ఆగి స్నానాలు ఆచరిస్తారు.
Similar News
News December 9, 2025
పీకల్లోతు కష్టాల్లో భారత్

కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి T20లో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన IND మూడో బంతికే వైస్ కెప్టెన్ గిల్(4) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్(12) కూడా ఎంగిడి బౌలింగ్‌లోనే గిల్ తరహాలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. అభిషేక్(17) దూకుడుకు బౌలర్ సిపామ్లా బ్రేకులేశారు. IND స్కోర్ 7 ఓవర్లలో 50/3.
News December 9, 2025
తెలంగాణకు పెట్టుబడుల ‘పవర్’

TG: గ్లోబల్ సమ్మిట్‌లో పవర్(విద్యుత్) సెక్టార్‌కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. మొత్తం రూ.3,24,698 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా 1,40,500 ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జెన్‌కో, రెడ్కో, సింగరేణి సంస్థలు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నాయని వెల్లడించారు.
News December 9, 2025
శాంసన్‌కు మరోసారి అన్యాయం: ఫ్యాన్స్

SAతో తొలి T20లో సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై ఆయన ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి సంజూకి అన్యాయం జరిగిందని, ఫామ్‌లో లేని కొందరు ప్లేయర్లకు టీమ్ మేనేజ్‌మెంట్ సపోర్ట్ చేస్తోందని SMలో పోస్టులు పెడుతున్నారు. SAతో గత T20 సిరీస్‌లో శాంసన్ 2 సెంచరీలు చేశారని, గిల్ కంటే సంజూ బ్యాటింగ్ Avg, SR మెరుగ్గా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ప్లేయింగ్11లో ఉండేందుకు సంజూ అర్హుడని పేర్కొంటున్నారు.


