News December 9, 2025
తిరుపతి నుంచి ఇంటర్ సిటీ నడపాలి: MLA

తిరుపతి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు రైళ్లు పెంచాల్సిన అవసరం ఉందని MLA ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి-సాయినగర్ శిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. గూడూరు-విజయవాడ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి నుంచి నడపాలని కోరారు. అలాగే హైదరాబాద్-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి వరకు పొడిగించాలని SCR GM శ్రీవాత్సవను కోరారు.
Similar News
News December 10, 2025
పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: EC

గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఈ మేరకు ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలోని 6 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
News December 10, 2025
న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా: పవన్ కళ్యాణ్

DMK ఆధ్వర్యంలోని ఇండీ కూటమి MPలు మద్రాస్ హైకోర్టు జడ్జిపై అభిశంసన నోటీసు ఇవ్వడాన్ని AP Dy.CM పవన్ ఖండించారు. “ఇది న్యాయవ్యవస్థ మొత్తాన్ని భయపెట్టే యత్నం కాదా? ఇలాంటప్పుడు భక్తులు తమ ఆలయాలను, మత వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు, రాజకీయ ద్వేషంతో ప్రేరితమైన న్యాయ దుర్వినియోగాలకు గురవకుండా ఉండేందుకు ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు దేశానికి అత్యవసరం” అని <
News December 9, 2025
రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తాం: కలెక్టర్

ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని, దీనిలో భాగంగానే ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్సార్ విశ్వవిద్యాలయం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RJY)తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. తద్వారా ఉద్యాన రంగంలో మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు.


