News December 10, 2025
వరంగల్: చలికాలంలో స్థానిక ఎన్నికల హీట్!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో స్థానిక రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. వార్డుల్లో అలకలు, అసంతృప్తులు వ్యక్తమవుతుండగా, కొత్త చేరికలు, తిరుగుబాటు నేతలను బుజ్జగించే ప్రయత్నాలతో పార్టీ కార్యాలయాలు బిజీగా మారాయి. అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమీకరణాలు, వర్గపోరు కలిసి ఈ చలికాలంలో ఎన్నికల హీట్‌ను పెంచుతున్నాయి.
Similar News
News December 10, 2025
మీరు గెలిస్తే ప్రజల తీర్పు.. మేం గెలిస్తే ఓట్ చోరీనా?: కలిశెట్టి

AP: రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై YCP MP మిథున్‌రెడ్డి లోక్‌సభలో మాట్లాడిన తీరు హాస్యాస్పదమని TDP MP కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ‘ఓట్ చోరీపై ఆయన మాట్లాడడం విడ్డూరంగా ఉంది. విజయనగరం, చిత్తూరు, హిందూపూర్‌లో ఓట్ల చోరీ జరిగినట్టు ఆయన చెప్పారు. YCP గెలిచినప్పుడు ప్రజాస్వామ్య తీర్పు అన్నారు. మేం గెలిస్తే ఓట్ చోరీ అంటున్నారు. YCP హయాంలో పలు ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలంతా చూశారు’ అని మండిపడ్డారు.
News December 10, 2025
మద్యం ప్రియులకు షాక్.. 10 మండలాల్లో 3 రోజులు బంద్

స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా యంత్రాంగం డ్రై డే ప్రకటించింది. డిసెంబర్ 11న జరగనున్న పోలింగ్ దృష్ట్యా, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు 10 మండలాల్లో మద్యం, కల్లు దుకాణాలు మూసివేయనున్నారు. DEC 9 సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 11న పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు.
News December 10, 2025
గద్వాల: జీపీ ఎన్నికలకు సర్వం సిద్ధం: ఎస్పీ

ఈనెల 11న జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు గద్వాల పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో సిద్ధమయ్యారని ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం గ్రీవెన్స్ హాల్లో సిబ్బందికి ఎన్నికల విధులకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల భద్రత, రూట్ మొబైల్ టీంలు, స్పెషల్ ట్రైనింగ్ ఫోర్స్ చేపట్టాల్సిన పనుల గురించి అవగాహన కల్పించారు.


