News December 24, 2025
సత్యసాయి జిల్లా ప్రజలకు కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు కలెక్టర్ శ్యాంప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, క్రైస్తవ సోదరులు ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. జిల్లాలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
Similar News
News February 21, 2026
17 లక్షల యాప్స్‌పై బ్యాన్!

ఆండ్రాయిడ్ యూజర్ల భద్రత కోసం ప్లేస్టోర్ క్లీనింగ్ చర్యలను గూగుల్ చేపట్టింది. ఫేక్, పాలసీలను ఉల్లంఘిస్తున్న 17.5 లక్షల యాప్స్‌ను బ్యాన్ చేసింది. హానికరమైన, ఫేక్ యాప్స్‌కు చెందిన 80 వేల డెవలపర్ అకౌంట్లను బ్లాక్ చేసింది. మరోవైపు 16 కోట్ల స్పామ్ రేటింగ్స్, ఫేక్ ఫీడ్ బ్యాక్స్‌ను డిలీట్ చేసింది. 2.55 లక్షల యాప్స్ అనవసరంగా లొకేషన్, ఫొటోలు, ఇతర వ్యక్తిగత సమాచారం అడగకుండా నిరోధించినట్లు కంపెనీ తెలిపింది.
News February 21, 2026
పీఎం సూర్యఘర్ అమలులో పురోగతి సాధించాలి: కలెక్టర్

PM సూర్యఘర్, PM కుసుం పథకాల అమలులో జిల్లా యంత్రాంగం వేగంగా పురోగతి సాధించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుంచి CS విజయానంద్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ, హాస్టళ్లలో సౌకర్యాలు, పారిశుద్ధ్యం గంజాయి నియంత్రణపై సమీక్షించారు. విద్యుత్ పొదుపుతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు.