News October 31, 2024
GHMC ఎన్నికలు.. KTR ఆన్సర్ ఇదే!
గ్రేటర్ ఎన్నికలపై KTR స్పందించారు. ‘ రాబోయే GHMC ఎన్నికల కోసం BRS కార్యాచరణ, ప్రణాళిక ఏంటి?’ అని ఓ నెటిజన్ ‘X’లో ప్రశ్నించారు. ‘GHMC అలాగే ఉంటుందో లేదో తెలియదు. బహుళ యూనిట్లుగా విభజిస్తారని పుకార్లు వస్తున్నాయి. వేచి చూద్దాం’ అంటూ AskKTRలో ఆయన బదులిచ్చారు. కాగా, గ్రేటర్లో ప్రస్తుతం 150 డివిజన్లు ఉన్నాయి. అయితే, GHMCలో శివారు మున్సిపాలిటీలు విలీనం అవుతున్నాయి. దీంతో డివిజన్ల సంఖ్య పెరగనున్నాయి.
Similar News
News November 23, 2024
జూబ్లీహిల్స్: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న సీఎస్
సమగ్ర కుటుంబ సర్వేలో సీఎస్ శాంతి కుమారి పాల్గొని వివరాలను అందజేశారు. శుక్రవారం సీఎస్ ఇంటికి వెళ్లిన అధికారులు వివరాలను సేకరించారు. అధికారులకు సీఎస్ పూర్తి వివరాలు సంబంధిత పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను ఎన్యుమరేటర్ నీరజ, సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పరిశీలించారు.
News November 23, 2024
HYD: మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటారా?: సాయి
అబద్ధాలు మాట్లాడడంలో KCR, హరీశ్‌రావును KTR మించిపోయాడని ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ మండిపడ్డారు. ఈరోజు HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. KTR దిమాక్ లేకుండా మాట్లాడుతున్నాడని, మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలంటూ ట్వీట్స్ చేస్తున్నాడని అన్నారు. చేపల పెంపకంపై గత BRS ప్రభుత్వం వల్ల కాలేదని.. 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లే అవార్డు వచ్చిందని తెలిపారు.
News November 23, 2024
HYD: WOW.. అందర్నీ ఆకట్టుకున్న రచన
హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో కళా సంకర్షిణి ప్రవేశ్ ప్రోగ్రాంలో ఎన్.రచన వేషధారణ అందరిని ఆకట్టుకుంది. వినూత్న వేషధారణతో, తన కళా ప్రతిభ నాట్య రూపాలను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు.