News November 21, 2024

అద్దె బస్సుల ఛార్జీలు తగ్గించిన TGSRTC

image

పెళ్లిళ్లు, టూర్ల కోసం ప్రయాణికులకు అద్దెకు ఇచ్చే బస్సుల ఛార్జీలను TGSRTC తగ్గించింది. పల్లె వెలుగు బస్సు అద్దె గతంలో కిలోమీటర్‌కు రూ.68 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.52కు తగ్గించింది. ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.69 తీసుకోగా ఇప్పుడు రూ.62కు కుదించింది. డీలక్స్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.65 నుంచి రూ.57కు తగ్గించింది. సూపర్ లగ్జరీ బస్సులకు రూ.65 నుంచి రూ.59కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

Similar News

News November 23, 2024

కాంగ్రెస్ ఫ్లాప్ షో.. ‘INDIA’పై ఎఫెక్ట్ తప్పదా?

image

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ఫ్లాప్ షో కొనసాగిస్తోంది. మహారాష్ట్రలో 101 స్థానాల్లో పోటీ చేసి 18, ఝార్ఖండ్‌లో 30 చోట్ల బరిలో నిలిచి 15 స్థానాలకు పరిమితమైంది. ఇటీవల హరియాణా, అంతకుముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తీరు. ఇకపై INDIAలో కాంగ్రెస్‌ మాట చెల్లుబాటు కాదని, ఆ కూటమే గల్లంతైనా ఆశ్చర్యం లేదని విశ్లేషకుల అంచనా. ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు సాగొచ్చని పేర్కొంటున్నారు.

News November 23, 2024

సీఎం పదవిపై గొడవలు లేవు: ఫడణవీస్

image

ముఖ్య‌మంత్రి ప‌ద‌విపై కూట‌మిలో ఎలాంటి గొడ‌వలు లేవ‌ని, ఈ విష‌యంలో కూట‌మి నేత‌లంద‌రూ చ‌ర్చించుకొని నిర్ణ‌యం తీసుకుంటామ‌ని దేవేంద్ర ఫడణవీస్ స్ప‌ష్టం చేశారు. సీఎం శిండే, ఫడణవీస్, అజిత్ ముగ్గురూ క‌లిసి మీడియాతో మాట్లాడారు. ఈ ఫ‌లితాలు ప్ర‌ధాని మోదీకి మ‌హారాష్ట్ర ఇస్తున్న మ‌ద్దతుకు నిద‌ర్శ‌న‌మ‌ని నేతలు పేర్కొన్నారు. ఒక్క‌టిగా ఉంటే సుర‌క్షితంగా ఉంటామ‌న్న నినాదానికే ప్ర‌జ‌లు జైకొట్టార‌న్నారు.

News November 23, 2024

మిలింద్ దేవరాపై ఆదిత్య ఠాక్రే గెలుపు

image

శివసేన(UBT) నేత ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే గెలుపొందారు. మహారాష్ట్రలో అత్యంత ప్రాధాన్యమున్న వర్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆదిత్య.. శివసేన(శిండే) అభ్యర్థి మిలింద్ దేవరాపై గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి వీరిద్దరిలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. మొత్తం 17 రౌండ్ల తర్వాత ఆదిత్య 8,801+ ఓట్లతో గెలుపొందారు. మన్మోహన్‌సింగ్ హయాంలో మిలింద్ కేంద్ర మంత్రిగా పని చేశారు.