News August 27, 2024

ఏది దొరికితే దాంతో కేసు పెడతారా: బరేలీ కోర్టు

image

బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నాడని నిరూపించేందుకు నిందితుడి వద్ద బైబిల్‌ లభించిందని పోలీసులు చెప్పడంపై యూపీలోని బరేలీ కోర్టు తీవ్రంగా మండిపడింది. దేన్నైనా సరే రికవరీ చేసి ఎవరిపైనైనా కేసు పెట్టడం ఆందోళనకరమని కోర్టు అభిప్రాయపడింది. అభిషేక్ గుప్తా అనే వ్యక్తి 32 మందిని మతం మార్పిస్తున్నాడన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సాక్ష్యాలు సరిగా లేకపోవడంతో కోర్టు పోలీసులపైనే చర్యలకు ఆదేశించింది.

Similar News

News September 9, 2024

మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు అస్వస్థత

image

TG: మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన అనారోగ్యానికి గురయ్యారని సమాచారం. దీంతో హుటాహుటిన ఆయనను గ్రీన్ ఛానెల్ ద్వారా ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. హరిబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 9, 2024

ఏలేరు రిజర్వాయర్‌కు పోటెత్తిన వరద

image

AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో కాకినాడ(D) ఏలేరు రిజర్వాయర్‌కు భారీ వరద వస్తోంది. ఇన్‌ఫ్లో 45,019, ఔట్‌ఫ్లో 21,775 క్యూసెక్కులుగా ఉంది. ఏలేశ్వరం- అప్పన్నపాలెం మధ్య కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాజుపాలెం వద్ద కాలువకు గండి పడింది. కాండ్రకోట వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. కిర్లంపూడి, పెద్దాపురం మండలాల్లో పంటలు నీట మునిగాయి. సమీప గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

News September 9, 2024

ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

image

ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ ఉందని అధికారులు వెల్లడించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను అలర్ట్ చేశారు. రేపు ఉదయం 11.30 గంటల వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.