News March 31, 2024

కొడుకు పేరును టాటూ వేయించుకున్న హీరో

image

‘12TH ఫెయిల్’ సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. తన కొడుకు పేరు వర్దాన్, పుట్టిన తేదీ 7-2-2024ను చేతిపై టాటూ వేయించుకున్నారు. ‘అడిషన్ ఆర్ అడిక్షన్?.. రెండింటినీ నేను ప్రేమిస్తాను’ అని రాసుకొచ్చారు. కాగా విక్రాంత్ తన ప్రేయసి శీతల్ ఠాకూర్‌ను 2022లో పెళ్లి చేసుకున్నారు.

Similar News

News February 18, 2026

నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. భారత్ బ్యాటింగ్

image

T20WC: అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో నామమాత్రపు మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అక్షర్ స్థానంలో సుందర్, కుల్దీప్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు.

IND: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్య (C), హార్దిక్ పాండ్య, దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.

News February 18, 2026

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌(TCIL) 24 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/BTech/MCA, MBA, BSc/BCom/BCA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.tcil.net.in

News February 18, 2026

భూ రిజిస్ట్రేషన్ల అక్రమార్కుల్ని వదిలిపెట్టం: పొంగులేటి

image

TG: ధరణి పోర్టల్‌లోని వ్యవస్థీకృత లోపాల వల్లనే రిజిస్ట్రేషన్ల సొమ్ము స్వాహా సహా ఇతర అక్రమాలు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘గత పాలకుల కాలంలో అనుమానాస్పద భూముల రిజిస్ట్రేషన్ల లాగిన్ డిలీట్ చేశారు. వారి స్వార్థానికి చేసిన లోపాలతో రిజిస్ట్రేషన్ల సొమ్ము స్వాహాకు దారితీసింది. వారినెవరినీ వదిలిపెట్టం. కోడ్ ఆడిట్‌కు ఆదేశించాం. భవిష్యత్తులో లోపాలకు తావుండరాదు’ అని పేర్కొన్నారు.