News March 26, 2024

కాసేపట్లో OTTలోకి హిట్ సినిమా

image

తమిళంలో హిట్‌గా నిలిచిన ‘లవర్’ సినిమా OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. జై భీమ్, గుడ్‌నైట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కె.మణికందన్ ఈ సినిమాలో నటించగా.. డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ సినిమా ఇవాళ అర్ధరాత్రి(మార్చి 27) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. తెలుగులో ఫిబ్రవరి 10న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

Similar News

News February 12, 2026

ఒమన్‌పై లంక ఘన విజయం

image

T20WCలో ఒమన్‌పై శ్రీలంక 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత శ్రీలంక 225/5 స్కోర్ చేసింది. కుశాల్ మెండిస్(61), పవన్(60), దసున్ శనక(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. 226 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన ఒమన్ 120/9 స్కోరుకే పరిమితమైంది. ఈ విజయంతో గ్రూప్-Bలో లంక(4 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన విషయం తెలిసిందే.

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘నటరాజ’’

image

శివుడు సమస్త కళలకు, నాట్యానికి అధిపతి. ఆయన చేసే తాండవం సృష్టి గమనాన్ని సూచిస్తుంది. శివుడు ‘ఆనంద తాండవం’ చేస్తున్నప్పుడు సృష్టి నిర్మాణం జరుగుతుందని, ‘రుద్ర తాండవం’ చేసినప్పుడు దుష్టశిక్షణ జరుగుతుందని చెబుతారు. ప్రపంచంలోని అణువణువూ ఆయన చలనం (నాట్యం) వల్లే కదులుతోందని కొందరు శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తారు. నాట్య కళ ద్వారా విశ్వ రహస్యాలను వెల్లడించే ఈ సార్వభౌముడిని ‘నటరాజు’గా మనం కొలుచుకుంటాం.

News February 12, 2026

మహిళల్లో అధిక మూత్ర విసర్జనకు కారణాలివే..

image

వయసు తక్కువగా ఉన్నా కూడా అతిగా మూత్రవిసర్జనకు వెళ్తుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కారణమంటున్నారు నిపుణులు. పెల్విక్‌ నొప్పి, పీరియడ్స్‌లో బ్లీడింగ్ ఎక్కువగా అవడం, మెనోపాజ్ వల్ల ఇలా జరుగుతుందంటున్నారు. అలాగే మూత్రం ఆపుకోలేకపోవడానికి పునరుత్పత్తి, మూత్ర అవయవాల నిర్మాణం, కాన్పులు, నెలసరి నిలిచాక హార్మోన్ల మార్పుల వంటివి కారణం. దీన్ని నివారించడానికి కెగెల్‌ వ్యాయామాలు ఉపయోగపడతాయంటున్నారు.