News September 11, 2025

గ్రూప్-1పై జుడీషియల్ కమిషన్ వేయాలి: కేటీఆర్

image

TG: హైకోర్టు ఆదేశించినట్టు గ్రూప్-1 పరీక్షను మళ్లీ తాజాగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కార్ వమ్ము చేసింది. అవకతవకలపై జుడీషియల్ కమిషన్ వేసి ఉద్యోగాల దొంగలెవరో తేల్చాలి. ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్న మోసపూరిత వాగ్దానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 12, 2025

రోజూ 2 లీటర్లకు పైగా పాలు.. ఇదే ఈ మేక స్పెషల్

image

సాధారణంగా ఒక మేక రోజుకు 500ml నుంచి లీటర్ వరకు పాలు ఇస్తాయి. కానీ బీటల్ జాతి మేకలు మాత్రం రోజూ 2 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని గురుదాస్‌పూర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో స్వచ్ఛమైన బీటల్ జాతి మేకలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని పాలు, మాంసం ఉత్పత్తి కోసం పెంచుతారు. పెద్ద శరీర పరిమాణం, చెవులు చదునుగా, పొడవుగా, వంకర్లు తిరిగి 15 సెంటీమీటర్ల పైనే ఉంటాయి.

News December 12, 2025

అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం

image

AP: అల్లూరి(D)లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా ప్రమాదంలో 15 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు భద్రాచలంలో దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

News December 12, 2025

నేడు అనఘాష్టమి వ్రతం ఆచరిస్తున్నారా?

image

మార్గశిర బహుళ అష్టమి అయిన నేడు అనఘాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. దత్తాత్రేయుడి రూపమైన అనఘ స్వామిని, ఆయన అర్ధాంగి అనఘా దేవిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. అష్టసిద్ధులు గల సంతానం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలని సూచిస్తున్నారు. ఈ పూజను రాముడు, ధర్మరాజు చేశారని నమ్మకం. అనఘాష్టమి పూజ ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.