News March 31, 2024

చంద్రబాబును కలిసిన వైసీపీ కీలక నేత

image

AP: పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. బాపట్ల పర్యటనకు వెళ్లిన చంద్రబాబుతో భేటీ అయిన జంగా.. పార్టీలో చేరికపై చర్చించారు. త్వరలోనే గురజాలలో జరిగే శంఖారావం సభలో జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా గురజాల వైసీపీ టికెట్ కోసం జంగా ప్రయత్నించగా.. కాసు మహేశ్‌రెడ్డికి జగన్ టికెట్ కేటాయించారు.

Similar News

News February 9, 2026

గొర్రెలను కొంటున్నారా? మంద వేగంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి?

image

గొర్రెల పెంపకంలో ఆదాయం మంద అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. దీని కోసం రైతులు మంద నుంచే గొర్రెలను కొనాలి. రెండు ఈతలకు మధ్య ఎక్కువ సమయం తీసుకునేవి వద్దు. చూడి, మొదటిసారి ఈనిన వాటిని కొంటే మంద పెరిగే ఛాన్సుంది. విత్తన పొట్టేలు రెండేళ్ల లోపు వయసుండి, ఆరోగ్యంగా, చురుకుగా, కవల పిల్లలను కనే వంశం నుంచి వచ్చినదై ఉండాలి. గొర్రెల మంద పెరగడానికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్ <<>>చేయండి.

News February 9, 2026

పట్టణాల్లో జీ ప్లస్ 3, 5 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు!

image

TG: పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లను జీ ప్లస్ 3, 5 టవర్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఒక్కో టవర్‌లో 12 ఇళ్లు ఉండేలా నిర్మాణం చేపట్టనుంది. ఇప్పటికే వీటి నిర్మాణానికి 19 స్థలాలు గుర్తించినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్) నుంచి నిర్మాణాలు ప్రారంభించనుంది. దీనికి సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు హౌసింగ్ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు.

News February 9, 2026

జంద్యం ధరిస్తున్నారా?

image

జంద్యం పొడవు వ్యక్తి ఎత్తుకు సమానంగా ఉంటుంది. ఇది జాగరణ, స్వప్న, సుషుప్తి, తురీయ అనే 4 ఆత్మ స్థితులను సూచిస్తుంది. దీనిని ధరించే విధానంలో 3 రకాలు ఉన్నాయి. శుభ కార్యాల్లో ఎడమ భుజంపై(సవ్యం), అశుభ కార్యాల్లో కుడి భుజంపై(ప్రాచీనావీతి), మలమూత్ర విసర్జన సమయంలో మెడలో దండలా(నివీతం) ధరించాలి. ఏటా శ్రావణ పూర్ణిమ లేదా జంద్యాల పూర్ణిమ నాడు కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించాలి.