News February 16, 2025

పూరీ-గోపీచంద్ కాంబోలో మూవీ?

image

లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత కొత్త మూవీపై డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఫోకస్ చేశారు. ఇటీవలే హీరో గోపీచంద్‌కు ఓ కథ వినిపించినట్లు సమాచారం. త్వరలోనే సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో వచ్చిన ‘గోలీమార్’ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కాగా గోపీచంద్ చివరి 3 చిత్రాలు(రామబాణం, భీమా, విశ్వం) బాక్సాఫీస్‌ను మెప్పించలేకపోయాయి.

Similar News

News April 16, 2026

చిత్తూరు జిల్లాలో కొత్త కార్యక్రమం

image

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం జలధార కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం 100 రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 3,106 చెరువులు ఉన్నాయి. జలధార కార్యక్రమాన్ని నాలుగు దశల్లో అమలు చేస్తామని అధికారులు తెలుపుతున్నారు. ఇందులో 15 మీటర్ల కంటే ఎక్కువ లోతున్న మండలాలకు ప్రాధాన్యమిచ్చి.. దానిని 3 నుంచి 6 మీటర్లకు తీసుకురావడమే లక్ష్యంగా పనులు చేస్తారు.

News April 16, 2026

రాత్రి బ్రష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?

image

రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేయడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచించారు. ‘రోజంతా తిన్న ఆహారం, చక్కెర దంతాలపై ఒక పొరలా పేరుకుపోతాయి. రాత్రి బ్రష్ చేయకపోతే గంటల తరబడి అలాగే ఉండి బాక్టీరియా పెరుగుతుంది. అది ఎనామెల్‌ను దెబ్బతీసి కావిటీస్, చిగుళ్ల సమస్యలకు దారి తీస్తాయి. నోటి దుర్వాసన పెరుగుతుంది. అందుకే రాత్రి భోజనం చేశాక నిద్ర పోయే ముందు బ్రష్ చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
Share It