News April 12, 2024

తల్లి కోసం బాబా గుడి కట్టించిన స్టార్ హీరో

image

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన తల్లి శోభ కోరిక మేరకు చెన్నైలో సాయిబాబా దేవాలయం కట్టించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘బాబా మందిరం నిర్మించాలని ఉందని విజయ్‌తో ఎన్నోసార్లు చెప్పా. నా ఇష్టాన్ని అర్థం చేసుకుని అతను గుడి కట్టించాడు. ప్రతి గురువారం నేను ఇక్కడికొచ్చి పూజలు చేస్తా. విజయ్ కూడా అప్పుడప్పుడూ వస్తుంటాడు’ అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం దళపతి.. GOAT అనే చిత్రంలో నటిస్తున్నారు.

Similar News

News December 14, 2025

15,762 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

image

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 15,762 (పెంచిన తరువాత) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. KVSలో 9,921, NVSలో 5841 పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇప్పటికే రెండు సార్లు గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. సైట్: https://www.cbse.gov.in/

News December 14, 2025

నదీజలాలపై కేసీఆర్ ప్రత్యక్ష పోరాటం: BRS

image

TG: కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 19న BRSLP, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో కృష్ణా-గోదావరి నదులపై కేసీఆర్ సర్కార్ పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చర్చ జరుగుతుందని BRS వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం జలాలను కొల్లగొడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోతోందని విమర్శించింది. దీనిపై ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని కేసీఆర్ భావిస్తున్నట్లు పేర్కొంది.

News December 14, 2025

ఉపసర్పంచ్‌‌ను ఎలా ఎన్నుకుంటారో తెలుసా?

image

గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అదే రోజు లేదా మరుసటి రోజు ఉపసర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ పదవికి గ్రామ పంచాయతీలోని వార్డు సభ్యులలో ఒకరిని ఎన్నుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉపసర్పంచ్‌ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. సర్పంచ్‌, వార్డు సభ్యులు సమావేశమై చేతులు పైకెత్తే విధానంలో (ఓపెన్‌ ఓటింగ్‌) ఉపసర్పంచ్‌ను ఎంపిక చేస్తారు. ఉపసర్పంచ్‌ పదవీకాలం ఐదేళ్లు.