News March 26, 2024

దుర్గమ్మ ప్రత్యేక దర్శనాలకు టికెట్ తప్పనిసరి

image

AP: విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక దర్శనాలకు టికెట్ తప్పనిసరి చేస్తూ EO రామారావు ఆదేశాలు జారీ చేశారు. ₹100, ₹300, ₹500 టికెట్లు ఉన్నప్పటికీ కొనుగోలు చేయకుండా పలువురు సిఫార్సుల పేరుతో నేరుగా దర్శనానికి వెళ్తున్నారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. ఇకపై అంతరాలయ దర్శనం చేసుకునే భక్తులకు ₹500 టికెట్ ఉండాల్సిందేనని ఈవో స్పష్టం చేశారు. నిత్యం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.

Similar News

News February 18, 2026

OTD: టీమ్ఇండియా సంచలన విజయం

image

రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు రాజ్‌కోట్‌లో టీమ్‌ఇండియా చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. ENGతో 3rd టెస్టులో 434 రన్స్ తేడాతో గెలిచింది. టెస్టుల్లో పరుగుల పరంగా భారత జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(131), జడేజా(112), రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (214), గిల్ (91) రాణించారు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి జడేజా 7, సిరాజ్ 4, బుమ్రా 2, అశ్విన్ 2, కుల్దీప్ 4 వికెట్లు తీశారు.

News February 18, 2026

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ వెలువడనుండగా మార్చి 16వ తేదీన పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించి 37 మంది రాజ్యసభ సభ్యులను ఎన్నుకోనున్నారు. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 9న BRS MP సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ పదవీకాలం ముగియనుంది.

News February 18, 2026

‘అన్నా.. ప్లీజ్ వదిలేయ్ అన్నా’

image

అంటూ ఆ చిట్టితల్లి ఎంత ప్రాధేయపడి ఉంటుంది! ఆ మానవమృగ వికృతక్రీడలో ఎంత నరకం అనుభవించి ఉంటుంది? ఏపీలోని మదనపల్లెలో కులవర్ధన్ ఏడేళ్ల బాలికను అత్యాచారం చేసి, హత్య చేసిన <<19172410>>ఘటన<<>> తీవ్రంగా కలచివేస్తోంది. ఇంటి ముందే ఉండే అతడిని నిత్యం ఆప్యాయంగా ‘అన్నా.. అన్నా’ అని పిలిచినా ఆ దుర్మార్గుడు కనికరించలేదు. అత్యంత క్రూరంగా బాలికను నీటి డ్రమ్ములో కుక్కేశాడు. విధి ఆడిన వింత నాటకంలో అతడు కూడా నీటిలోనే శవమై తేలాడు.