News March 28, 2024
మఫాకా పేరిట చెత్త రికార్డు

ఐపీఎల్ సీజన్-17 ఆడుతున్న అతి పిన్న వయస్కుడు క్వేనా మఫాకా(17) అరంగేట్ర మ్యాచ్‌లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఈ ముంబై బౌలర్ 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఐపీఎల్‌లో అత్యంత చెత్త బౌలింగ్ రికార్డులో మూడో స్థానంలో నిలిచారు. 2018లో బసిల్ థంపీ 70, 2023లో యశ్ దయాల్ 69 పరుగులు సమర్పించుకుని టాప్-2లో ఉన్నారు.
Similar News
News February 18, 2026
40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

<
News February 18, 2026
ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..

ప్రెగ్నెన్సీలో తల్లి తీసుకొనే ఆహారాన్ని బట్టి బిడ్డ బరువు ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు పిండం వెయిట్ తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ఆహారాలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవకాడో, గుడ్లు, పాలు, పాల పదార్థాలు, పప్పులు, నాన్ వెజ్, నట్స్, సీడ్స్, చిలగడదుంప వంటివి ఆహారంలో చేర్చుకుంటే కడుపులోని బిడ్డ బరువు పెరగడానికి సాయపడతాయంటున్నారు.
News February 18, 2026
‘తెల్లపారుడు వ్యాధి’ని కోళ్లలో ఎలా గుర్తించాలి?

‘సాల్మొనెల్లా పుల్లొరం’ బ్యాక్టీరియా వల్ల కోడి పిల్లల్లో తెల్లపారుడు వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నలతగా ఉండి ముడుచుకుని కూర్చుంటాయి. రెట్ట నీళ్లగా తెలుపు లేదా లేత పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఈకలు రాలిపోయి, రెక్కలు వేలాడేస్తాయి. ఈ వ్యాధి నివారణకు సల్ఫా లేదా టెట్రాసైక్లిన్ ముందును చిటికెడు చొప్పున ఒక టీ గ్లాసు నీళ్లలో కలిపి రోజుకు రెండు సార్లు వెటర్నరీ నిపుణుల సూచన మేరకు ఇవ్వాలి.


