News November 14, 2025

A1గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి

image

మంగళంపేటలో 75.74ఎకరాలకే పట్టాలు ఉండగా.. పెద్దిరెడ్డి కుటుంబం 32.63ఎకరాల అటవీ భూమిని తమ స్థలంలో కలిపేసుకున్నారని PCCFచలపతిరావు వెల్లడించారు. ‘ఏ1గా మిథున్ రెడ్డి, ఏ2గా రామచంద్రారెడ్డి, ఏ3గా ద్వారకానాథ్ రెడ్డి, ఏ4గా ఇందిరమ్మ పేర్లు నమోదు చేశాం. అటవీ భూముల్లో ఉద్యాన పంటలు సాగు చేసి ఆదాయం పొందారు. చట్ట విరుద్ధంగా బోర్ తవ్వారు. రూ.1.26 కోట్ల విలువైన అటవీ సంపదకు నష్టం వాటిల్లింది’ అని ఆయన చెప్పారు.

Similar News

News November 14, 2025

కౌంటింగ్ షురూ..

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో 2, 3 గంటల్లో ఫలితాల సరళి తెలియనుంది. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. అటు బిహార్‌లో 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

News November 14, 2025

ఈనెల 17న జాబ్ మేళా

image

AP: ఈనెల 17న పార్వతీపురం Employment Office ఆధ్వర్యంలో ఆన్‌లైన్ జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. 18ఏళ్లు పైబడిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. మొత్తం 1150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ముందుగా https://rb.gy/68z9mn లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

News November 14, 2025

భద్రాద్రి జిల్లాలో 45,681 మంది డయాబెటిస్ బాధితులు

image

భద్రాద్రి జిల్లాలో డయాబెటిస్ బాధితులు సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. జిల్లాలో వ్యాప్తంగా 5,19,760మందికి పరీక్షలు నిర్వహించగా 45,681 మందిని డయాబెటిస్ బాధితులుగా గుర్తించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 30శాతంపైగా డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ‘నేడు వరల్డ్ డయాబెటిస్ డే’