News April 12, 2024

‘ఆడు జీవితం’ రికార్డ్ కలెక్షన్లు

image

పృథ్వీరాజ్ నటించిన ఆడు జీవితం సినిమా కలెక్షన్లలో రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.130 కోట్ల వసూళ్లు రాబట్టి.. సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘లూసిఫర్’ కలెక్షన్లను(రూ.128కోట్లు) దాటేసింది. దీంతో మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల్లో నిలిచింది. తొలి 4 స్థానాల్లో మంజుమ్మల్ బాయ్స్ (రూ.230Cr), 2018(రూ.176Cr), పులి మురుగన్(రూ.150 Cr), ప్రేమలు (రూ.136Cr) సిినిమాలున్నాయి.

Similar News

News December 17, 2025

APPLY NOW: ICMRలో 28 పోస్టులు

image

<>ICMR<<>> 28 సైంటిస్ట్-B పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎంబీబీఎస్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, CBT,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC,ST,PWBD,మహిళలు, EWSలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.icmr.gov.in/

News December 17, 2025

టోనర్ ఎంపిక ఇలా..

image

ప్రస్తుతం స్కిన్‌కేర్‌పై అందరికీ అవగాహన పెరిగింది. దీంట్లో ముఖ్యమైనది టోనర్. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి, ఆరోగ్యంగా ఉంచుతుంది. పొడిచర్మం ఉన్నవారు తేమను అందించే టోనర్, సున్నితచర్మం ఉన్నవారు కలబంద, చామంతి గుణాలున్నవి, జిడ్డు చర్మం ఉన్నవారు తాజాదనాన్ని కలిగించేవి ఎంచుకోవాలి. ఆల్కహాల్, పారాబెన్స్, బెంజైల్ పెరాక్సైడ్ వంటివి హాని చేస్తాయి. కాబట్టి టోనర్‌లో ఇవి లేకుండా చూసుకోవాలి. <<-se>>#SkinCare<<>>

News December 17, 2025

మీ బ్రెయిన్ వయస్సుని ఇలా తగ్గించుకోండి

image

వయస్సు పెరగడం సహజమే. కానీ బ్రెయిన్‌ను యవ్వనంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. USకు చెందిన ఫ్లోరిడా వర్సిటీ చేసిన అధ్యయనంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించిన వారి మెదడు వాస్తవ వయస్సు కంటే 8 ఏళ్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మంచి నిద్ర, సరైన బరువు, స్మోకింగ్‌కు దూరంగా ఉండటం, ఒత్తిడిని నియంత్రించడం వంటివి బ్రెయిన్ ఆరోగ్యాన్ని పెంచినట్లు తేలింది. తద్వారా ఓల్డేజ్‌లో వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులు రావు.