News April 15, 2024
ఫెమినిజంపై నటి షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ జంటలు డబ్బు, పేరు కోసమే పెళ్లి చేసుకుంటారన్న బాలీవుడ్ భామ నోరా ఫతేహీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్త్రీవాదం సమాజాన్ని నాశనం చేసిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘మహిళలు పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదనే ధోరణిని విశ్వసించను. ప్రస్తుతం పురుషుల మెంటాలిటీ కూడా మారింది. అందరం సెంటిమెంట్స్‌లో సమానమే కానీ సామాజికపరంగా కాదు. స్త్రీవాదం రాడికల్‌గా మారితే సమాజానికి ప్రమాదకరం’ అని అన్నారు.
Similar News
News December 15, 2025
300 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 300 AO పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ/PG, MA ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.85వేలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBDలకు రూ.250. వెబ్‌సైట్: orientalinsurance.org.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News December 15, 2025
జాబ్ చేసుకుంటూ బీటెక్!

వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ చదువును కొనసాగించేందుకు AICTE పర్మిషన్ ఇచ్చింది. ఉద్యోగం చేస్తూనే డిప్లొమా, బీటెక్, ఎంటెక్, MBA వంటి కోర్సులు పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కాలేజీలు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అమలు చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు ఆఫీసు వేళల తర్వాత లేదా వీకెండ్స్‌లో క్లాసులకు హాజరుకావచ్చు. ఇప్పటికే ఈ విధానం కొన్నిచోట్ల అమల్లో ఉండగా, ఇకపై పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
News December 15, 2025
‘AGRATE’ ఏం చేస్తుంది?

‘AGRATE’ చిన్న రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక వ్యవసాయ పరికరాలు, సేంద్రియ ఎరువులను తక్కువ ధరకే అందిస్తోంది. అలాగే కొమ్మలను అంటుకట్టడం, ఎక్కువ పంటల సాగు, స్థిరమైన వ్యవసాయ విధానాలపై రైతులకు ఆధునిక శిక్షణ ఇవ్వడంతో పంట దిగుబడి పెరిగింది. ITC, Godrej, Parle వంటి కంపెనీలతో శుక్లా ఒప్పందం చేసుకోవడంతో రైతుల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరిగి వారి ఆదాయం గణనీయంగా పెరిగింది.


