News April 1, 2024

ADB: అదుపు తప్పి లోయలో పడ్డ ఆటో

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని లక్ష్మీ పూర్ చెక్ పోస్ట్ వద్ద ఆదిలాబాద్ వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాక, మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే వారిని 108 వాహనం ఈఎంటీ కిషన్, పైలెట్ విట్టల్ గౌడ్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Similar News

News February 13, 2026

ఉట్నూర్: 4KGల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్

image

నమ్మదగిన సమాచారంతో ఇంద్రవెల్లి పోలీసులు శ్మశానవాటిక వద్ద నిఘా ఉంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కొడప రమేష్, కుంర గంగారం, కుముర కృష్ణల వద్ద నుంచి 4కిలోల గంజాయి, మోటార్ సైకిల్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను ఉట్నూర్ కోర్టులో రిమాండ్ చేసినట్లు ఎస్ఐ సాయన్న వెల్లడించారు.

News February 13, 2026

సిబ్బందికి శుభాకాంక్షలు: ఆదిలాబాద్ కలెక్టర్

image

జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బంది క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసి మొత్తం ప్రక్రియను సాఫీగా పూర్తి చేశారని ఆయన అభినందించారు. మద్దతు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కౌంటింగ్‌లో పాల్గొన్న సిబ్బంది, భద్రతా సిబ్బంది, సంబంధిత అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

News February 13, 2026

విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవు: ADB DSP

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఫలితాల వేళ డీఎస్పీ జీవన్ రెడ్డి ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, టపాకాయలు పేల్చడం నిషేధమని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రం, ప్రధాన చౌరస్తాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. ప్రజలు గుమిగూడరాదని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని, పోలీసులకు సహకరించాలని కోరారు.