News December 2, 2025

ADB: అసలు మీరు ఏ వర్గం రా బాబూ..!

image

పంచాయతీ ఎన్నికల వేళ పార్టీలోకి ఫిరాయింపులు, చేరికలు జోరందుకున్నాయి. పలువురు నాయకులు ఓవైపు అధికార పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతూ, మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నాయకులతో అంట కాగుతున్నారు. ఉదయం ఒక పార్టీ కండువా వేసుకుని.. సాయంత్రం మరో పార్టీలో చేరుతున్న ఘటనలు చేసుకుంటున్నాయి. ఇది చూసిన పలువురు మీరు ఏ వర్గం రా బాబు అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మీ ప్రాంతంలోనూ ఇలాగే జరుగుతోందా కామెంట్ చేయండి.

Similar News

News February 15, 2026

అనకాపల్లి: డీ-గ్రేడ్ విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రణాళిక

image

అనకాపల్లి జిల్లాలో పదో తరగతిలో చదువులో వెనుకబడిన 648 మంది డీ-గ్రేడ్ విద్యార్థుల కోసం 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను విద్యాశాఖ అధికారులు అమలు చేస్తున్నారు. వీరిలో 298 విద్యార్థులను 20 వసతి గృహాల్లో ఉంచి చదివిస్తున్నారు. మిగిలినవారిని సంబంధిత స్కూల్స్‌లోనే ఉంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వీరందరు ఉత్తీర్ణులు అయ్యే విధంగా సెలెక్టెడ్ ప్రశ్నలు ఇచ్చి చదివిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఈనెల 18న పర్చూరులో జాబ్ మేళా

image

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 18న పర్చూరులోని ఎస్‌కేపీఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఈ మేళాలో 18 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10 ఆపై చదివి 18 ఏళ్లు నిండినవారు అర్హులన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.