News September 12, 2025

ADB: ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభించిన మంత్రి జూపల్లి

image

ఆదిలాబాద జిల్లా భోరజ్ మండలం పిప్పర్వాడ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. లబ్ధిదారులతో కలిసి ఆయన గృహప్రవేశంలో పాల్గొన్నారు. పేదలంతా ఆత్మగౌరవంతో జీవించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని, ఈ పథకాన్ని ప్రారంభించారని జూపల్లి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల వల్ల లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం కనిపిస్తుందని ఆయన చెప్పారు. లబ్ధిదారులకు కొత్త బట్టలు అందించారు.

Similar News

News December 16, 2025

MBNR: ఓటు హక్కును వినియోగించుకోండి- ఎస్పీ

image

ప్రతి ఓటరు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. పలు గ్రామాల్లో పర్యటించిన అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఏవైనా సమస్యలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పికెటింగ్, మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేశామన్నారు.

News December 16, 2025

ఇప్పటివరకు IPL వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు

image

*రూ.27 కోట్లు- రిషభ్ పంత్ (లక్నో)
*రూ.26.75 కోట్లు- శ్రేయస్ అయ్యర్ (పంజాబ్)
*రూ.25.20 కోట్లు- గ్రీన్ (కేకేఆర్)
*రూ.24.75 కోట్లు- స్టార్క్ (కేకేఆర్)
*రూ.23.75 కోట్లు- వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్)
*రూ.20.50 కోట్లు- కమిన్స్ (SRH) *రూ.18.50 కోట్లు- సామ్ కరన్ (పంజాబ్) *రూ.18 కోట్లు- పతిరణ (కేకేఆర్), అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్), చాహల్ (పంజాబ్)

News December 16, 2025

42% రిజర్వేషన్ల సాధనకు పోరాడుతూనే ఉంటాం: సీతక్క

image

TG: బీసీ కులగణన ప్రకారం 42% రిజర్వేషన్ల సాధన టార్గెట్‌గా కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో 2 విడతల్లో 8,566 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయన్నారు. గ్రామస్థాయిలో కూడా కాంగ్రెస్ సత్తా చాటిందని చెప్పారు. సమ్మక్క-సారలమ్మ జాతర, ఆదివాసీ సంస్కృతి, ఆత్మగౌరవంపై తప్పుడు కామెంట్లు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ సహించబోదని హెచ్చరించారు.